ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి
ABN, First Publish Date - 2023-07-03T22:30:30+05:30
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పం చాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక మంచిర్యాల కమిటీ ఆధ్వ ర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
నస్పూర్, జూలై 3: ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పం చాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక మంచిర్యాల కమిటీ ఆధ్వ ర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వా లని, పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, కార్యదర్శి సంకె రవి, నాయకులు రంజిత్ కుమార్, దాసు, ప్రేమ్ కుమార్, మోహన్, శ్రీకాంత్, అభినవ్, రాజేశ్వరి పాల్గొన్నారు.
ఫ లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఊత్కూరు శివారులో గల 375 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, ఖాళీ చేయమని కొందరు బెదిరిస్తున్నారని తెలిపారు. పట్టాలు అందజేయాలని కోరారు. నాయకులు లాల్ కుమార్, దొండ ప్రభాకర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-07-03T22:30:30+05:30 IST