వైభవంగా మార్కండేయ జయంతి
ABN, First Publish Date - 2023-01-24T22:50:51+05:30
జిల్లాలోని పలు చోట్ల మంగళవారం మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దవాగు నది తీరాన గల మార్కండేయ ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 24: జిల్లాలోని పలు చోట్ల మంగళవారం మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దవాగు నది తీరాన గల మార్కండేయ ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌక్, గాంధీ చౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్‌ల మీదుగా మార్కండేయ చిత్రపటంతో నిర్వహించిన శోభాయాత్రలో మహిళల కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు అశోక్, శ్రీనివాస్, రాజు, లింగయ్య, శ్రీకాంత్, ధర్మయ్య, విజయ, సునీత, పుష్పలత, వ్రీనివాస్, చందు, తిరుపతి, మోహన్, శ్రీనివాస్, సంజీవ్, నవీన్, ప్రణ్, మంగ, జయగౌరి, ఆంజనేఉలు, వెంకన్న, ప్రకాష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: మండల కేంద్రంలో మంగళవారం భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక మార్కండేయ ఆలయ నిర్మాణం చేశారు. అనంతరం స్వామి ఫొటోతో మంగళహారతులతో ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్షీరాభిషేకం, జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తిరుపతి, వెంకటేష్, సర్పంచ్ లావణ్య, శ్రీనివాస్, అశోక్, రాజేష్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ, శంకర్, విజయ, విలాస్, సంతోష్, మల్లయ్య, వంకర్, వెంకటేష్, బాలాజీ, మల్లయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, బాపు, విలాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మంగళవారం మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు రోహిదాస్, నరేష్, మహేష్, శేఖర్, అశోక్, రామకృష్ణ, సతీష్, నరేష్, సంజీవ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-24T22:50:53+05:30 IST