ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలి: ఎస్పీ

ABN, First Publish Date - 2023-11-26T22:54:46+05:30

ఆసిఫాబాద్‌, నవంబరు 26: ఎన్నికలు సజావుగా నిర్వ హించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆదివారం జిల్లా పోలీసు అధి కారులతో సమావేశం నిర్వహించారు.

- జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 26: ఎన్నికలు సజావుగా నిర్వ హించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆదివారం జిల్లా పోలీసు అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల సజావుగా నిర్వ హించేందుకు ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందరితో మర్యాదపూ ర్వకంగా మెలగాలని అన్నారు. నవంబరు 29 మధ్యాహ్నం నుంచి 30న పోలింగ్‌ పూర్తయ్యే నిర్ణీత సమయంవరకు పోలింగ్‌కేంద్రాల వద్ద విధుల్లో ఉండడం, ఈవీఎంలు, ఇతరపోలింగ్‌ సామగ్రిని సురక్షితంగా కాపాడడం ముఖ్యమని అన్నారు. ఎన్నికలు మొదలయ్యే 48 గంటల ముందు నుంచి పోలింగ్‌ కేంద్రాలలోకి అనధికార వ్యక్తులను అనుమతించవద్దని సూచించారు. కేంద్ర ఎన్నికలసంఘం తెలిపిన ప్రవవర్తన నియమావళిని పాటించాలని తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎం స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాలవద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రిసైండింగ్‌ అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. పురుషులు, మహిళల ఓటర్లకు వేరువేరుగా క్యూలైన్లు ఉండేలా చూడాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో జనాలు గుమి కూడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. 200మీటర్ల దూరంలో వాహనాలను అనుమ తించవద్దని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని, ఓటర్లకు నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులను సరఫరా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు సృష్టించే వారిని ముందస్తు బైండోవర్‌ చేయాలనలి సూచించారు. సమా వేశంలో డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్‌, సీఐ రాణాప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T22:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising