ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ఘనంగా కార్తీక పౌర్ణమి

ABN, First Publish Date - 2023-11-27T22:45:57+05:30

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 27: జిల్లాకేంద్రంలో ప్రజలు కార్తీ కపౌర్ణమి వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని పెద్దవాగులో వేకువ జామున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివకేశవ ఆలయం లో ప్రత్యేకపూజలు నిర్వహించా రు.

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 27: జిల్లాకేంద్రంలో ప్రజలు కార్తీ కపౌర్ణమి వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని పెద్దవాగులో వేకువ జామున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివకేశవ ఆలయం లో ప్రత్యేకపూజలు నిర్వహించా రు. భక్తుల తాకిడితో పట్టణంలోని ఆలయాలు కిటకిటలాడాయి. బాలేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వ హించారు. కాగడా హారతి పుర స్కరంచుకొని వాసవీ మందిరం, కేశవనాథ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నెలరోజులుగా పట్టణంలోని శివకే శవ మందిర్‌, కేశవనాథ ఆలయాల్లో నిర్వహిస్తున్న కాగడాహారతి భక్తబృందం ఆధ్వర్యంలో గోపాల కృష్ణుడి చిత్రపటంతో కాగడాలతో పురవీధుల్లో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తునతరలివచ్చారు. భజనలు,భక్తుల శివనామస్మర ణతో ఆలయాలు మార్మోగాయి. పౌర్ణమి పురస్క రించుకొని దీపాలు వెలిగించడంతోపాటు దీపదా నాలుచేశారు. పౌర్ణమిపురస్కరించుకొని సత్యనారా యణస్వామి వ్రతాలు, తులసీ లగ్నాలు జరిపారు.

దహెగాం: మండలంలోని పలుగ్రామాల్లో సోమ వారం కార్తీకపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు. ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. వాగుల్లో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు.సాయంత్రం దీపాలు వెలిగించారు.

కెరమెరి: మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో ఉదయం నుంచే ఇంటివద్ద ఉన్న తులసి చెట్టుకు పూజలునిర్వహించి దీపాలు వెలిగించారు. సమీపం లోని వాగుల్లో దీపాలు వెలిగించారు. గోయగాంలో శివాలయంలోపూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు.

బెజ్జూరు: కార్తీకపౌర్ణమితో మండలకేంద్రంలోని రంగనాయక, శివాలయ, హనుమాన్‌ వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు తులసి, ఉసిరికచెట్ల వద్ద కార్తీకదీపాలు వెలిగించారు.

Updated Date - 2023-11-27T22:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising