ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్‌ బొమ్మలకు అంతర్జాతీయఖ్యాతి

ABN, First Publish Date - 2023-01-21T01:52:12+05:30

జిల్లాలో తయారయ్యే బొమ్మలకు అంత ర్జాతీయఖ్యాతి చెందాయని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ జివి నరసింహారెడ్డి అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 20 : జిల్లాలో తయారయ్యే బొమ్మలకు అంత ర్జాతీయఖ్యాతి చెందాయని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ జివి నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లో హస్తకళల ఎగుమతి ప్రోత్సా హక సంస్థ మూడు నెలలు నిర్వహించే శిక్షణను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ లేస్‌ట్రేడ్‌ సెంటర్‌ గురుశిష్యప్రశిక్షణ్‌ నిర్మల్‌లో ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిర్మల్‌లో బొమ్మలను ఎగు మతి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. హస్తకళల ఎగుమతుల ప్రో త్సాహక సంస్థ దక్షిణాది రాష్ర్టాల సంచాలకులు కలువకొలను నాగతులసి రావు దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ ఈ శిక్షణలో మాస్టర్‌ క్రాప్ట్‌ శిక్ష కుడు నేర్పిన మెళుకువలు పాటిస్తూ కొయ్యబొమ్మలను నైపుణ్యం ప్రదర్శించి తయారు చేయాలన్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిది ద్దాల న్నారు. హస్తకళపై ఆధారపడ్డ వేలాది మందికి పనికల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. శిక్షకులకు టూల్‌కిట్లు పంపిణీ చేశారు. ఈ శిక్షణలో మహిళలు, పురుషులు ఆసక్తిగా పాల్గొన్నారు. జౌళిమంత్రిత్వశాఖ డీసీహెచ్‌ మనీష్‌, ఎగ్జిక్యూటివ్‌ దివాకర్‌, ఏసురాయుడు, నిర్మల్‌ అసోసియేట్‌ మేనేజర్‌ బీఆర్‌ వంకర్‌, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, తదితర కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T01:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising