తెలంగాణ ఏర్పాటుతో పారిశ్రామిక రంగంలో గణనీయ ప్రగతి
ABN, First Publish Date - 2023-06-07T00:59:35+05:30
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఐటీ, పారిశ్రామికరంగం గణనీయ అభివృద్ధి సాధిస్తోందని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి అన్నా రు.
నిర్మల్ టౌన్, జూన్ 6 : తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఐటీ, పారిశ్రామికరంగం గణనీయ అభివృద్ధి సాధిస్తోందని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి అన్నా రు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అంబేద్కర్ భవన్‌లో పారిశ్రామిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఐటీ పరిశ్రమలతో పాటు బయోలాజికల్ పార్కులు, ఫార్మా కంపెనీలు ఎక్కువ వరకు అభివృద్ధి చెందాయని, ఎందరికో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రత్యేకరాష్ట్రంలో కరెంట్‌కోతలు అధిగమించి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగడంతో ఎలాంటి ఆటంకం లేకుండా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా పరిశ్రమలకు అవసర మయ్యే నీరందిస్తున్నామని అన్నారు. టీఎస్‌ఐపాస్, టిఫ్రైడ్ పథకాలు లబ్ధి చేకూర్చుతున్నాయన్నారు. జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వాల్లో సమాచార సాంకేతిక, పరిశ్రమల రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పరిశ్రమలశాఖ జీఎం నర సింహారెడ్డి జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలను వివరించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జడ్పీ సీఈవో సుధీర్, లీడ్‌బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్‌డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
రేపు చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలి
నిర్మల్ కల్చరల్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూర చెరువుల పండగను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో, ఎస్పీ ప్రవీణ్ కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. చెరువుల వద్ద ఉన్న దేవాలయా ల్లో ప్రత్యేకపూజలు జరపాలన్నారు. చెరువుల వద్ద జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయా లన్నారు. సామూహిక భోజనం చేయాలన్నారు. చెరువుల వద్ద బారికేడ్లను నిర్మించి గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలపై డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. రేపు నిర్వహించే ఫిష్ ఫెస్టివల్ పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు. నూతన కలెక్టర్ కార్యాలయంలోకి షిఫ్ట్ అయి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్‌వో లోకేష్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
Updated Date - 2023-06-07T00:59:35+05:30 IST