ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సాయి చందుకు ఘన నివాళి

ABN, First Publish Date - 2023-06-29T22:30:29+05:30

తెలంగాణ ప్రజా ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచంద్‌ అకాల మృతికి జిల్లా కళాకారులు సంతాపం తెలిపారు. నస్పూర్‌ గోదావరి కాలనీ చౌరస్తాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కళాకారులు సాయి చందు చిత్రపటం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, జూన్‌ 29: తెలంగాణ ప్రజా ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచంద్‌ అకాల మృతికి జిల్లా కళాకారులు సంతాపం తెలిపారు. నస్పూర్‌ గోదావరి కాలనీ చౌరస్తాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కళాకారులు సాయి చందు చిత్రపటం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సాయి చందు మరణం తెలంగాణకు తీరని లోటని కళాకారులు తెలిపారు. కళాకారులు డప్పు సమ్మయ్య, ముల్కల మురళి, మామిళ్ళ లక్ష్మణ్‌, సోమశేఖర్‌ కొప్పర్తి సురేందర్‌, కొప్పర్తి రవీందర్‌, టీబీజీకేఎస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి పోటి లింగం, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షులు సుందిళ్ల రాజన్న, నాయకులు వంగ తిరుపతి, ఎంబడి సమ్మయ్య, కొయ్యల లింగన్న, తదితర కళాకారులు పాల్గొన్నారు.

ఏసీసీ: తెలంగాణ ఉద్యమకారుడు, కవి, గాయకుడు, రాష్ట్ర గిడ్డం గుల సంస్థ చైర్మన్‌ సాయిచందు మృతికి సంతాపంగా అమవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. వారు మాట్లాడుతూ సాయిచందు మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. గోగుల రవీందర్‌రెడ్డి, నరెడ్ల శ్రీనివాస్‌, సుదమల్ల అశోక్‌తేజ, భోడ ధర్మేందర్‌, పాల్గొన్నారు.

దండేపల్లి: తెలంగాణ మలిదిశ ఉద్యమకారుడు, ప్రముఖ గాయ కుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచందు మృతి రాష్ట్రానికి తీరని లోటని దళిత సంఘం రాష్ట్ర నాయకుడు గోళ్ల రాజమల్లు అన్నారు. దండేపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సాయిచందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు దయాకర్‌, వసంత్‌, వంశీ, డేవిడ్‌, అనిల్‌, కమలాకర్‌, సత్యనారయణ, తిరుపతి, ప్రేమ్‌సాగర్‌, నాగేష్‌, మహాబూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: సాయిచందుకు అంబేద్కర్‌ యువజన సంఘం నాయ కులు నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో ఊపిరి పోసి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాయిచందు మరణం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆవునూరి లచ్చన్న, ప్రధాన కార్యదర్శి బైరం రవి, ఉపాధ్యక్షుడు బైరి లింగన్న, కౌన్సిలర్‌ చాతరాజు రాజన్న, ప్రచార కార్యదర్శి ప్రసాద్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-29T22:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising