నడుంనొప్పి భరించలేక ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-05-12T01:33:42+05:30
మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన వీరసరపు లింగన్న(48) అనే వ్యక్తి నడుం నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.
కుబీర్, మే 11 : మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన వీరసరపు లింగన్న(48) అనే వ్యక్తి నడుం నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. వివరాల ప్రకారం.. నిగ్వా గ్రామానికి చెందిన లింగన్న గత పది సంవత్సరాల నుండి నడుము నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన నడుం నొప్పి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. బుధవారం చేనులోకి వెళ్తానని చెప్పి వెళ్లి, అనం తరం 2గంటలకు తిరిగి వచ్చి ఇంట్లో పడుకోగా వాంతులు చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు భైంసాలో ప్రైవేటు ఆసుపత్రికి తర లించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 6గంటలకు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. మృతుని భార్య శ్యామల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-05-12T01:33:42+05:30 IST