ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth : సోనియాకు కానుక!

ABN, First Publish Date - 2023-12-04T03:52:03+05:30

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కానుకగా ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆలకించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకే పట్టం..

కర్ణాటక ఫలితాలతో మొదలైన కాంగ్రెస్‌ గాలి

రేవంత్‌ దూకుడు.. కనుగోలు వ్యూహం

అడుగడుగునా అండగా నిలిచిన అధిష్ఠానం

ఓటర్లను ఆకర్షించిన ఆరు గ్యారెంటీలు

కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత

వెరసి ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కానుకగా ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆలకించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ ఫామ్‌లోకి వచ్చిన హస్తం పార్టీ.. ఎప్పటికప్పుడు పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ ఎన్నికల నాటికి సునామీలా మారింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతకు రేవంత్‌ దూకుడు.. అధిష్ఠానం వ్యూహం తోడయ్యాయి. ఫలితంగా మేజిక్‌ ఫిగర్‌ను దాటేసి 64 సీట్లలో విజయ దుందుభి మోగించింది. వాస్తవానికి.. సంప్రదాయ ఓటుబ్యాంకు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన క్రెడిట్‌ ఉన్నా.. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ డీలా పడింది. 2018లో పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలో విలీనం కావడంతో.. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే అధికార పార్టీలోకి ఫిరాయిస్తారన్న అపవాదునూ మూటగట్టుకుంది. అదే సమయంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు గెలవడం, ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ గెలవడంతో ప్రత్యామ్నాయ రేసులోకి బీజేపీ వచ్చేసింది. అయితే ప్రజాకర్షణ కలిగిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో కాంగ్రె్‌సలో మళ్లీ ఊపు వచ్చింది. కానీ, పార్టీలో వర్గపోరు, నేతల మధ్య వివాదాలతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ గందరగోళంలోనే హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. అయితే చిన్న సెంటిమెంట్‌ను పట్టుకుని సెన్సెక్స్‌ లేచినట్లుగా.. కర్ణాటక ఫలితాల ఆధారంగా తెలంగాణలోనూ కాంగ్రెస్‌ రేసులోకి వచ్చేసింది. కర్ణాటకలో ఓటమిపాలైన బీజేపీ.. ఇక్కడ కూడా రేసులో వెనుకబడింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంతో.. ప్రత్యామ్నాయ రాజకీయం పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ కంట్రోల్‌లోకి వచ్చేసింది. దానికి తగ్గట్టుగా పార్టీ అధిష్ఠానం పకడ్బందీ వ్యూహాలను అమలు చేయడంతో హస్తం హవా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.

అధిష్ఠానం అండ.. రేవంత్‌ దూకుడు!

తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. అందుకు తగినట్లుగా పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ వచ్చింది. తొలుత.. వర్గపోరుతో అస్తవ్యస్తంగా మారిన పార్టీని చక్కదిద్దే కార్యక్రమాలు చేపట్టింది. మీడియా ముఖంగా పలువురు నేతలు వర్గ విభేధాలను రచ్చకెక్కించినా సమన్వయంతో వ్యవహరించింది. విభేధాలు తీవ్రమైనప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిని మార్చింది. నాయకత్వ మార్పు లేదని స్పష్టత ఇస్తూనే అసంతృప్తులతో భేటీలు నిర్వహించిన అధిష్ఠానం పెద్దలు.. వారికి తగిన భరోసా కల్పించారు. ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారు. మొత్తంగా నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపారు. నాయకులంతా ఒక్కతాటిపైనే ఉన్నారంటూ ప్రజలకు సంకేతాలిచ్చేందుకు ముఖ్యనేతల ఉమ్మడి బస్సుయాత్రకు రాహుల్‌గాంధీ స్వయంగా నేతృత్వం వహించారు. ప్రచారంలోనూ రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కావలసినంత సమయం కేటాయించారు. తెలంగాణ గ్రామీణ ఓటర్లకు కాంగ్రెస్‌ పార్టీ కనెక్ట్‌ కావడానికి రాహుల్‌, ప్రియాంక ప్రచారం చేసిన తీరు కూడా ఒక కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి ప్రచారంలో అమలు చేయాల్సిన వ్యూహాల వరకూ అధిష్ఠానమే నిర్ణయించి అమలు చేసింది. అయితే అధిష్ఠానం వ్యూహాలకు రేవంత్‌రెడ్డి దూకుడు, పార్టీ నేతల మధ్య ఐక్యత తోడు కావడంతో రాష్ట్రలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్నికల ముందు కేసీఆర్‌కు దీటుగా రేవంత్‌ చేసిన సుడిగాలి ప్రచారం బాగా కలిసివచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్‌ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. వాస్తవానికి కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్న దగ్గర్నుంచే ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ప్రారంభమైందని చెబుతారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సిటింగ్‌ సీట్లు కోల్పోవడమూ దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. అయితే ఆ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో అప్పట్లో కాంగ్రెస్‌ విఫలమైంది. కానీ, కర్ణాటక ఎన్నికల తర్వాత పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమ వైపునకు మళ్లించుకోవడంలో సక్సెస్‌ అయింది. టీ కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలకు, ఆరు గ్యారెంటీలకు అధిష్ఠానం పెద్దలు హామీగా నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఇటు అధిష్ఠానం, అటు కర్ణాటక ప్రభుత్వం అండగా నిలవడంతో కేసీఆర్‌ను ఢీకొట్టగల పార్టీ కాంగ్రెస్సేనన్న భావనకు ప్రజలు వచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత, ఇతర వర్గాలను వివిధ కార్యక్రమాల ద్వారా ఆకట్టుకోవడంలోనూ పార్టీ సక్సెస్‌ అయింది. ముఖ్యంగా ‘‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’’ వంటి నినాదాలను విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ సీఎం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నదీ రేవంత్‌రెడ్డి ప్రకటించడం, దానికి అనుగుణంగా ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రానున్నదన్న ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లడమూ ఓటర్లు కాంగ్రెస్‌ పట్ల ఆకర్షితులు కావడానికి ఒక కారణంగా చెబుతున్నారు. దీనికితోడు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పట్ల సహజంగా వ్యతిరేకత ఏర్పడటం, పదేళ్లు బీఆర్‌ఎ్‌సకు అధికారం ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సపార్టీకి ఒక సారి అధికారం ఇద్దామన్న భావనకు ప్రజలు రావడమూ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చింది.

Updated Date - 2023-12-04T03:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising