బీసీలారా.. బీజేపీకి మద్దతివ్వండి: మందకృష్ణ
ABN, First Publish Date - 2023-11-21T02:46:32+05:30
రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బీసీలకు ఇదే మంచి అవకాశమని.. బీసీని సీఎం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ..
పంజాగుట్ట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బీసీలకు ఇదే మంచి అవకాశమని.. బీసీని సీఎం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బీసీలు, బీసీ సంఘాలు బీజేపీకి మద్దతు పలకాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేస్తారో.. చేయరో.. తన ఇష్టం కానీ బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు తాము, తమ అనుబంధ విభాగాలు పనిచేస్తాయని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని.. కాంగ్రె్‌సకు ఓటేస్తే రేవంత్‌రెడ్డి లేదా మరొకరో సీఎం అవుతారని చెప్పారు. బీజేపీకి మద్దతిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-11-21T02:53:51+05:30 IST