కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana CM: మరికాసేపట్లో సీఎం పేరు ప్రకటన.. రేవంత్ రెడ్డితో సీపీఐ నేతల భేటీ

ABN, First Publish Date - 2023-12-05T16:34:44+05:30

తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు.

Telangana CM: మరికాసేపట్లో సీఎం పేరు ప్రకటన.. రేవంత్ రెడ్డితో సీపీఐ నేతల భేటీ

హైదరాబాద్: తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు.

కాగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం తిరుగు పయనమైన పరిశీలకుడు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరికాసేట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. నగరం చేరుకున్నాక సీనియర్లతో చర్చ అనంతరం సీఎం పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని నిర్ణయించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రేవంత్ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో చెప్పిన తర్వాత ప్రకటన చేయనున్నారని సమాచారం.

కాగా సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ భేటీ తర్వాత పరిశీలకుల బృందం ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించింది. ఆ వెంటనే భట్టి విక్రమార్క్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపాయి. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.

Updated Date - 2023-12-05T17:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising