కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao : అయ్యో పాపమని కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆగమైపోతం

ABN, First Publish Date - 2023-11-07T02:54:48+05:30

ఈసారీ తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపిందని.. ఒక్క చాన్స్‌ అంటున్న ఆ పార్టీని అయ్యో పాపమని గెలిపిస్తే ఆగమైపోతామని

Harish Rao : అయ్యో పాపమని కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆగమైపోతం

ఆ పార్టీ గోబెల్స్‌ ప్రచారం చేసినా బీఆర్‌ఎ్‌సదే గెలుపు

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈసారీ తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపిందని.. ఒక్క చాన్స్‌ అంటున్న ఆ పార్టీని అయ్యో పాపమని గెలిపిస్తే ఆగమైపోతామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇటీవలె కాంగ్రె్‌సను వీడిన టీపీసీసీ కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌ బీఆర్‌ఎ్‌సలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నగే్‌షతోపాటు ఆయన అనుచరులకు హరీశ్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, ఎవరు ఎన్ని చెప్పినా మూడోసారి కేసీఆరే సీఎం అని, బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు. ఉద్యమంలో ఎక్కడాలేని ద్రోహి రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మరని, బీసీల పట్ల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న తీరును అందరూ గమనించాలని కోరారు. అసలు కాంగ్రెస్‌ ఏం చేసిందని ఓటు వేయాలని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ చెప్తే.. జనం నవ్వుకుంటున్నారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే గడ్డం తీయనన్న ఉత్తమ్‌, కొడంగల్‌లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డి మాట తప్పారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి సాధించాయని, వైద్యం, విద్యారంగ సేవలు విస్తృతం చేశామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల విద్యుత్తు, పింఛన్లు ఇస్తుండగా.. కాంగ్రె్‌సను గెలిపించి కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ముదిరాజులను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు.

Updated Date - 2023-11-07T10:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising