Telangana Elections: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ABN, First Publish Date - 2023-11-30T17:26:13+05:30
తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో నిలబడ్డవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా ఉందని సమాచారం అందుతోంది. మొత్తం మీద తెలంగాణలో 65 నుంచి 68 శాతం మధ్యలోనే పోలింగ్ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గనుంది. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా రాత్రి 7 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-30T17:26:15+05:30 IST