ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌తో కంగుతిన్న ‘కారు’.. డైలామాలో కేసీఆర్!!

ABN, First Publish Date - 2023-11-30T22:18:27+05:30

Election Exit Polls -2023 : తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్-03 ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అదిగో అధికారంలో వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రమాణ స్వీకారమే ఇక ఆలస్యం అంటూ చెప్పుకుంటున్నాయి..

తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్-03 ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అదిగో అధికారంలో వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రమాణ స్వీకారమే ఇక ఆలస్యం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే.. నవంబర్-30న తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అటు పోలింగ్ ముగియగానే ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఈ ఎగ్జిట్స్ పోల్స్‌తో అధికార బీఆర్ఎస్ కంగుతినగా.. కాంగ్రెస్ మాత్రం అంతా అనుకున్నదే అక్షరాలా నిజం అవుతోందని చెప్పుకుంటోంది.


కారు.. సారు.. ఇక రారు!!

అవును.. హ్యాట్రిక్ కొట్టబోతున్నాం.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని కాబోతున్నా.. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.. రాసిపెట్టుకోండి.. ఇవీ గులాబీ బాస్ కేసీఆర్ నోట పదే పదే వచ్చిన మాటలు. కట్ చేస్తే.. సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. గురువారం సాయంత్రం సుమారు 20కి పైగా రాష్ట్ర, జాతీయ ప్రముఖ మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. ఇందులో ఒకటి అర మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చగా.. మిగిలినవన్నీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశాయి. మరికొన్ని సర్వేలు మాత్రం మ్యాజిక్‌ ఫిగర్‌కు అటు ఇటుగా కాంగ్రెస్‌కు సీట్లు రావొచ్చని వెల్లడించాయి. అంటే ఇంచుమించు 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగిటివ్ ఫలితాలే రానున్నాయని జోస్యం చెప్పేశాయన్న మాట. దీంతో ఒక్కసారిగా గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యిందట. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట. ఇక సోషల్ మీడియాలో అయితే.. లెక్కలేనన్ని పోస్టులు, అంతకుమించి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ‘కారు.. సారు.. రారు’ అన్నది అక్షరాలా నిజమవుతుందని నెటిజన్లు చెప్పుకుంటున్న మాట.

ఏం చేద్దాం..?

ఈ ఎగ్జిట్ పోల్స్‌తో ‘కారు’ పార్టీ అధిష్టానం కంగుతిన్నదట. ఇక కేసీఆర్ అయితే.. ‘ఎందుకిట్ల జరిగింది’.. ‘ప్రభుత్వంపై ప్రజలు ఎందుకింత వ్యతిరేకతతో ఉన్నారు’ అంటూ డైలమాలో పడ్డారట. మంత్రి కేటీఆర్ ఒక్కరు తప్ప ఇంతవరకూ ఈ ఎగ్జిట్ పోల్స్‌పై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపట్లేదు. ఏదో నిశ్శబ్ధ యుద్ధమే జరిగిందని భావిస్తున్నారట. మరోవైపు ఆఖరి నిమిషంలో రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ ఏదో ప్లాన్ చేశారనే టాక్ కూడా నడుస్తోంది. ఇవాళ రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వాస్తవానికి మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమేనని మొదట్నుంచీ గ్రౌండ్ లెవల్‌లో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్లడంలో.. ప్రభుత్వం వ్యతిరేకతను, స్కామ్స్‌, ఉద్యోగాలు వదలట్లేదనే విషయం, ఆఖరి నిమిషంలో రైతుబంధు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్న మాట. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించిన తర్వాత తెలంగాణలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయన్నది జగమెరిగిన సత్యమే. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా తప్పేనని కేటీఆర్.. అబ్బే ఇవన్నీ తారుమారవుతాయని రాసిపెట్టుకోండి అంటూ బీజేపీ కీలక నేతలు చెబుతున్న మాట.

Election Exit Poll Results 2023 : ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

అయ్యో సారూ..!!

ఇక గెలిచేస్తున్నాం.. వాట్ నెక్స్ట్ అంటూ రెండ్రోజులుగా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకున్న పరిస్థితి. ‘అధికారంలోకి రాగానే ఏం చేయాలి..? తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏమేం చేయాలి..?’ అని ముఖ్యనేతలతో సమాలోచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. మూడోసారి ముఖ్యమంత్రి గా డా. బిఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారు. మరోవైపు.. ప్రమాణ స్వీకార ముహూర్తం తేదీ, సమయం ఖరారు కోసం పురోహితులతో కూడా సీఎం సంప్రదింపులు జరపారని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే నడిచింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏ ఫైల్‌పై తొలి సంతకం చేయాలనే అంశంపై కేసీఆర్ ముందుగానే అగ్రనేతలతో చర్చించారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం చేస్తారని బయటికి లీకులు వచ్చాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్‌తో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. దీంతో ఈ వ్యవహారంపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఓ రేంజ్‌లో నడుస్తున్నది. మొత్తానికి చూస్తే.. డిసెంబర్-03 తో తెలుగు ప్రజల్లో నెలకొన్న ఈ ఫలితాలు ఉత్కంఠకు తెరపడనుంది. ఇవాళ రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అక్షరాలా నిజమవుతాయో.. లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయో అనేది చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-30T22:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising