ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గురుపౌర్ణమికి ముస్తాబైన బాబా మందిరం

ABN, First Publish Date - 2023-07-03T00:02:02+05:30

సాయినాథుడి జన్మదినం రోజున గురుపౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. షిరిడీలో సాయిబాబాకు జరిగే ఆరాధనోత్సవాల మాదిరిగానే జిల్లాలోని సాయిబాబా మందిరాల్లో అత్యంత వైభవంగా ఉత్సవాలు ని ర్వహించనున్నారు.

ముస్తాబైన హాలియాలోని సాయిమందిరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుపౌర్ణమికి ముస్తాబైన బాబా మందిరం

నల్లగొండ, హాలియా, జూలై 2: సాయినాథుడి జన్మదినం రోజున గురుపౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. షిరిడీలో సాయిబాబాకు జరిగే ఆరాధనోత్సవాల మాదిరిగానే జిల్లాలోని సాయిబాబా మందిరాల్లో అత్యంత వైభవంగా ఉత్సవాలు ని ర్వహించనున్నారు. సాయిబాబా మందిరాల ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మామిడి తోరణాలు, పూలు, కొబ్బరి మట్టలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నారు. హాలియాలోని శ్రీ షిర్డీ సాయిమందిరం గురుపౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము న కాకడ హారతి, 108 కలశాలతో బాబాకి కలశాభిషేకం, ఉదయం పు ప్పార్చన, సంస్థాన హారతి, ధునిపూ జ, భజన కార్యక్రమం, మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం మహాఅన్నదాన కార్యక్రమం, సాయంత్రం సామూ హిక విష్ణు సహస్రనామ స్తోత్ర పా రాయణం చేపట్టనున్నట్లు ఆల య కమిటీ అధ్యక్షుడు తేలపోలు శేఖర్‌ తెలిపారు. కళాకారుల విన్యాసాలతో హాలియా పురవీధుల్లో అంగరంగ వై భవంగా సాయినాథుని శోభాయాత్ర, పల్లకిసేవ రాత్రి బ్రాహ్మణ ఆశీర్వచనం, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయిమందిరాన్ని పూలమా లలు, లైటింగ్‌లతో ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త మిట్టపల్లి సుబ్బారావు, కార్యదర్శి బానోతు స క్రునాయక్‌, మిట్టపల్లి శివకుమార్‌ ఉన్నారు.

Updated Date - 2023-07-03T00:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising