ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు టాక్సీకారు పంపిణీ

ABN, First Publish Date - 2023-05-17T21:35:08+05:30

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (Balagam Mogilaiah)కు దళితబంధు పథకం ప్రభుత్వం మంజూరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (Balagam Mogilaiah)కు దళితబంధు పథకం ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని మినిష్టర్‌ క్వార్టర్స్‌లో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ దళితబంధు పథకం (Dalit Bandhu)లో మొగిలయ్యకు టాక్సీకారు యూనిట్‌ను పంపిణీ చేశారు. కరోనా సమయంలో మొగిలయ్యకు రెండు కిడ్నీలు పాడై డయాలిసిస్‌ చేసుకొని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఎం దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో మాట్లాడి దళితబంధు పథకం మంజూరు చేశారు. ఈ సందర్భంగా పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా వైద్యం చేయించడంతో పాటు.. దళితబంధు పథకం ఉపాధి యూనిట్‌ను అందించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావు, దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-05-17T21:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising