ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : పార్టీ లైన్‌కు కట్టుబడి ఉంటా

ABN, First Publish Date - 2023-06-11T02:57:16+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు అనేది కేవలం ప్రచారమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘‘నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఊహాగానమే

● చార్జిషీట్‌లో కవిత పేరు లేకుంటే

బీజేపీ–బీఆర్‌ఎస్‌కు ఒక్కటైనట్లా?

● తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కడుంది?

● చిట్‌చాట్‌లో బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు అనేది కేవలం ప్రచారమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘‘నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. మా పార్టీలో అలాం టి లీకులకు, ప్రచారాలకు అవకాశం ఉండదు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయా? పార్టీ లైన్‌కు కట్టుబడి ఉంటా. జాతీయ అధ్యక్షుడు చెప్పిన మేరకు పని చేస్తా’’ అని సంజయ్‌ స్పష్టం చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేంద్రమంత్రి పదవి ఎవరికైనా దక్కినప్పుడు ముందుగా పేర్లు బయటికి వచ్చా యా? రాష్ట్ర పదవి ఇచ్చినప్పుడు ఎవరి పేర్లయినా బయటపడ్డాయా? బీజేపీకి రాష్ట్రంలో పోటీ బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌తో కాదని’’ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో కాంగ్రె స్‌కు అతీగతి లేదు. ఆ పార్టీకి హుజూరాబాద్‌లో అభ్యర్థి కూడా లేరు’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని, చేరికల కోసం ఎవరో వస్తారని ఎదురుచూడబోమని కమలం గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. ‘‘కవితపై ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోంది. ఆధారాలు ేసకరిస్తున్నారు. దొంగలు ఎవరైనా సరే మోదీ సర్కారులో తప్పించుకోలేరు. చార్జిషీట్‌లో పేరు లేకుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఒప్పందం కుదరినట్లా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. కాస్త ఆలస్యమైనా తప్పు చేసినవారు జైలుకెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. విచారణ పూర్తికాకముందే అరెస్టు చేయాలంటే ఎలాగని నిలదీశారు. కేసీఆర్‌ చేయించుకున్న సర్వేలో బీజేపీకి ఆదరణ పెరిగిందని తేలిందని.. ఇంటిలిజెన్స్‌ నివేదిక కూడా అదేనని చెప్పారు. నిర్మల్‌లో కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఖమ్మం సభతో బీజేపీ దమ్ము చూపుదాం

ఖమ్మంలో ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్‌ చేసి దమ్ము చూపుదామని బండి సంజయ్‌ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. భారీ జన సమీకరణ కోసం నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా బాధ్యత తీసుకున్న నాయకులు స్థానికంగా ఉండి పోలింగ్‌ బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వివిధ మోర్చాల నేతలు ఆయా సంఘాలు, సామాజిక వర్గాల నేతలతో సమావేశమై సభకు ఆహ్వానించాలని చెప్పారు. మహిళా మోర్చా నేతలు ఖమ్మం జిల్లాలో మకాం వేసి ఇంటింటికీ వెళ్లి సభకు పిలవాలన్నారు.

Updated Date - 2023-06-11T02:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising