ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

ABN, First Publish Date - 2023-07-30T01:58:33+05:30

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇటీవల ఆయనను రాష్ట్ర పార్టీ సారథ్యం నుంచి తప్పించిన అధినాయకత్వం జాతీయ స్థాయిలో కీలక

  • దక్షిణాది నుంచి సంజయ్‌కే అవకాశం

  • ఏపీ ఇన్‌చార్జ్‌గా నియమించే చాన్స్‌

  • పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగింపు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇటీవల ఆయనను రాష్ట్ర పార్టీ సారథ్యం నుంచి తప్పించిన అధినాయకత్వం జాతీయ స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టింది. తద్వారా రాష్ట్ర పార్టీలో కొద్ది రోజులుగా నెలకొన్న స్తబ్ధతను తొలగించే ప్రయత్నం చేసింది. శనివారం ప్రకటించిన 8 మంది ప్రధాన కార్యదర్శుల జాబితాలో దక్షిణాది నుంచి ఒక్క బండి సంజయ్‌కే చోటు దక్కడం గమనార్హం. మూడేళ్లుగా తెలంగాణ నుంచి ఈ పదవిలో ఎవరూ లేరు.ఇంతకుముందు పార్టీ సీనియర్‌ నేత పి. మురళీధర్‌రావు జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. కాగా, సంజయ్‌ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సేవలను పార్టీపరంగా వినియోగించుకునేందుకే జాతీయ నాయకత్వం మొగ్గుచూపింది. ఆయన్ను ఏపీ ఇన్‌చార్జ్‌గా కూడా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సునీల్‌ దియోధర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించడం గమనార్హం. సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన సంజయ్‌, సంఘ్‌ ప్రచారక్‌గా పనిచేశారు. కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా పని చేసిన ఆయన గత ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. మూడున్నరేళ్లకు పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన పోరాటాలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ మరోసారి నియమితులయ్యారు. శనివారం ప్రకటించిన కొత్త జాబితాలో ఆమెకు మరోసారి చోటు దక్కింది.

పార్టీలో కీలక మార్పులు..

శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పార్టీ కేంద్ర ఆఫీసు బేరర్ల జాబితాలో పలు మార్పులు చేశారు. కర్ణాటకకు చెందిన సిటి రవి, అస్సాం నుంచి దిలీప్‌ సైకియాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. బిహార్‌కు ఎంపీ రాధా మోహన్‌ సింగ్‌, బెంగాల్‌కు చెందిన దిలీప్‌ ఘోష్‌, గుజరాత్‌కు చెందిన భారతి బెన్‌ సియాల్‌లను పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నడ్డా చేసిన కీలక మార్పుల్లో భాగంగా అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ తారిఖ్‌ మన్సూర్‌కు బీజేపీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ అంటోనీని జాతీయ కార్యదర్శిగా నియమించారు. యూపీకి చెందిన సురేంద్ర సింగ్‌ నాగర్‌, అస్సాంకు చెందిన కామాఖ్య ప్రసాద్‌లను పార్టీ కార్యదర్శులుగా నియమించారు. బీజేపీ కొత్త టీమ్‌లో 13 మంది ఉపాఽధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఎల్‌ సంతో్‌షను కొనసాగించాలని నిర్ణయించారు.

గొప్ప అవకాశం: సంజయ్‌

జాతీయ కార్యవర్గంలో తనకు చోటు కల్పించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని బండి సంజయ్‌ తెలిపారు. సామాన్య కార్యకర్త అయిన తనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, బండి సంజయ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి, విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టడంలో సంజయ్‌ చేసిన కృషికి జాతీయ నాయకత్వం గుర్తింపు ఇచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభా్‌ష, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆవునూని రమాకాంత్‌రావు అన్నారు.

Updated Date - 2023-07-30T02:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising