నేడు భువనగిరిలో బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన
ABN, First Publish Date - 2023-01-12T00:01:14+05:30
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పరిస్థితిపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా, తాజా పరిస్థితులపై ఆరా తీ స్తోంది. కేంద్రంలోని కీలకమైన నేతలను నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొని, మరిన్ని వివరాలు తెలుసుకుని, పార్టీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
హాజరుకానున్న జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్
యాదాద్రి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పరిస్థితిపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా, తాజా పరిస్థితులపై ఆరా తీ స్తోంది. కేంద్రంలోని కీలకమైన నేతలను నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొని, మరిన్ని వివరాలు తెలుసుకుని, పార్టీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియోజకవర్గాలకు ప్రభారీలు, విస్తారక్‌లను నియమించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయిలోని కీలకమైన నేతలకు బాధ్యతలను అప్పగించింది. వీరంతా పార్టీ బలోపేతంతో పాటు నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని సూచించింది. విస్తారక్‌లు, ప్రభారీలను నియమించిన తర్వాత మొదటిసారి భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. గురువారం 3.30 గంటలకు నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో పాటు బీజేపీ అధిష్టానంలో కీలకమైన నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు. భువనగిరిలో జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కీలక నేతలు హాజరవుతున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 6వరకు జరిగే భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సమావేశంలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లోని మండల అధ్యక్షులు, జిల్లా ఆఫీసు బేరర్స్, పార్లమెంట్ కన్వీనర్స్, ప్రభారీలు, విస్తారక్‌లు, అసెంబ్లీ కన్వీనర్లు, ప్రభారీలు, పాలక్‌లు, విస్తారక్‌లు, బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్స్, కార్యవర్గసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
Updated Date - 2023-01-12T00:01:18+05:30 IST