ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amith Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా పోస్ట్‌మార్టం

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:58 PM

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్‌మార్టం చేపట్టారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ నోవాటెల్‌లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్‌మార్టం చేపట్టారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ నోవాటెల్‌లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, గరికపాటి, చాడా సురేష్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు. బీజేపీ ముఖ్యనేతల మధ్య కోల్డ్‌వార్‌పై అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్‌రెడ్డిని ఆదేశించారు.


బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై చర్చ..

బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది. బీసీ‌ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్‌గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బావుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉండే అవకాశం ఉంది.


సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం !

నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేతల మధ్య కోల్డ్ వార్‌పై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ చేసే అవకాశమిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ బరిలో నిలవనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్‌సభ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీలు పని చేసుకుంటూ పోవాలని చెప్పినట్లు సమాచారం.

Updated Date - Dec 28 , 2023 | 04:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising