ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మనస్తాపంతో ఇద్దరి బలవన్మరణం

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:12 AM

కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.

రాజేశ్వరి(ఫైల్‌)

మాడ్గులపల్లి, డిసెంబరు 29 : కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చెర్వుపల్లి గ్రామానికి చెందిన కొండా వెంకన్న రెండో కుమార్తె కొండా రాజేశ్వరీ(18) ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. గతేడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. అదే తరుణంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో తట్టుకోలేక ఉరివేసుకుంది. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చే సరికి మృతి చెందింది. ఘటనపై తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

కుటుంబ సమస్యలతో...

కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన సాధినేని గోవిందరావు(32)కు గత ఏడాది మిర్యాలగూడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీవిద్యతో వివాహమైంది. అప్పటి నుంచి గోవిందరావు అత్తగారింటి వద్ద ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తరుచు భార్య, అత్తమామలు, బావమరిదితో గొడవలు జరుగుతుండేవి. గురువారం పెద్దదేవులపల్లి గ్రామశివారులోని పొలంలో పనిచేస్తుండగా భార్య శ్రీవిద్య, మామ యలమంద, అత్త లలిత, బావమరిది వీరకృష్ణలు గొడవపడి కర్రలతో దాడి చేసి దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురై అక్కడే ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు వెంటనే అతడిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోవిందరావు సోదరుడు సాధినేని సైదారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా గోవిందరావు భార్య, అత్త, మామ, బావమరిదిలు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 30 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising