ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: బీజేపీ బీ టీమ్‌గా బీఆర్‌ఎస్‌

ABN, First Publish Date - 2023-06-29T02:16:07+05:30

బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రకూ విస్తరించి.. మరాఠా రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో మండిపడింది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవసరం లేకున్నా కేసీఆర్‌ బుర్రలో ‘జాతీయ పార్టీ’ పురుగు.. ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేసే యత్నం

● గతంలో బీజేపీ ఒవైసీ ద్వారా ఓట్లు చీల్చింది

● ముస్లింలు, దళితులు నమ్మరని తేలడంతో కేసీఆర్‌ను దించింది..‘సామ్నా’ సంపాదకీయం

రైతుల పేరుతో ఓట్లడుగుతూ కేసీఆర్‌ మహారాష్ట్ర రైతులకు భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. ఓట్ల చీలిక ద్వారా ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మహారాష్ట్రలో బీజేపీ ఇప్పటికే చాలా గుర్రాలను, గాడిదలను (పార్టీలను) తన ‘బి’ టీమ్‌గా వాడుతోంది. ఇప్పుడు తెలంగాణ నుంచి మరో పార్టీ చేరిందంతే

‘సామ్నా’ సంపాదకీయంలో కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు

ముంబై, జూన్‌ 28: బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రకూ విస్తరించి.. మరాఠా రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో మండిపడింది! బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీకి ‘బి’ టీమ్‌గా తన సంపాదకీయంలో అభివర్ణించింది. 400కు పైగా వాహనాలతో కేసీఆర్‌ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించిన నేపథ్యంలో.. కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగింది. ‘‘బీఆర్‌ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. కానీ, ఆ అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకొక ప్రాంతీయపార్టీ (టీఆర్‌ఎస్‌) ఉంది. అది బాగా పనిచేస్తోంది. అయినా.. జాతీయ రాజకీయాలనే పురుగు కేసీఆర్‌ బుర్రలో దూరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌ కృషి చాలా గొప్పది. ఆయన తెలంగాణకు రెండుసార్లు సీఎం అయ్యారు. ఆ రాష్ట్రంలో రెతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పలు పథకాలను విజయవంతంగా అమలు చేశారు. అయినప్పటికీ కేసీఆర్‌ పార్టీ 2024లో గెలుస్తుందన్న హామీ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. ఆ పార్టీ కాళ్ల కింది నేల కదిలిపోతోంది. కేసీఆర్‌ కుమార్తె కవిత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఢిల్లీ మద్యం కేసులో కేంద్రదర్యాప్తు సంస్థలు ఆమెపై దర్యాప్తు జరుపుతుంటే.. కేసీఆర్‌ ఏమో, కేంద్ర దర్యాప్తు సంస్థ ఒత్తిడి రాజకీయాలు చేస్తోందని, వారికి తాము తలొగ్గేది లేదని, పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. కేసీఆర్‌ ఇప్పుడు వేస్తున్న రాజకీయ అడుగులు, పరోక్షంగా బీజేపీకి సహకరించేలా కనిపిస్తున్నాయి. 2019 నుంచి బీజేపీ.. మజ్లిస్‌ పార్టీ అధినేత ఒవైసీని ఓట్ల చీలికకు వాడుకుంటోంది. (ముస్లింల) ఓట్లు చీల్చడానికి ఒవైసీ మహారాష్ట్రకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. కానీ.. ఒవైసీ కుట్రను అర్థం చేసుకున్న ముస్లింలు, దళితులు ఆయన్ను నమ్మట్లేదని స్పష్టమవుతోంది’’ అని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. అందుకే బీజేపీ ఒవైసీ స్థానంలో కేసీఆర్‌ను రంగంలోకి దింపి ఉండొచ్చని.. కేసీఆర్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తుండవచ్చని అభిప్రాయపడింది.

ఇన్నాళ్లూ ఈ భక్తి ఏమైంది?

పండరిపురంలో కొలువై ఉన్న పాండురంగ విఠలుడిపై కేసీఆర్‌కు ఇన్నాళ్లూ లేని భక్తి ఇప్పుడు కొత్తగా, లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎలా పుట్టుకొచ్చిందని సామ్నా పత్రిక ప్రశ్నించింది. ‘‘బీఆర్‌ఎస్‌ పార్టీ హోర్డింగులు, ప్లకార్డులను మహారాష్ట్రలో ప్రదర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అసంతృప్తుల కోసం కేసీఆర్‌ ఒక వేదికను ఏర్పాటు చేశారు. తద్వారా ఓట్లను తమకు సాధ్యమైనంతమేర చీల్చి బీజేపీ రాజకీయాలకు ఉపయోగపడాలనుకుంటున్నారు. కేసీఆర్‌ సామర్థ్యాన్ని శంకించాల్సిన పని లేదు. కానీ.. ప్రస్తుతం ఆయన ఆడుతున్న ఆట ఆయనది కాదు. వేరెవరో ఆయన్ను వాడుకుంటున్నారు. అయితే.. పాండురంగ విఠలుడు మేలుకునే ఉన్నాడు. కళ్లు తెరిచి అంతా చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు.’’ అని ముక్తాయించింది.

ఏమిటీ బలప్రదర్శన: పవార్‌

పుణే, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ 600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలో ర్యాలీ నిర్వహించడంపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్పందించారు. ‘‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్రకు పూజలు చేసేందుకు వస్తే అందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. కానీ తన బలాన్ని ప్రదర్శించేందుకు వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించడం అవాంఛనీయమే’’ అని అన్నారు. కేసీఆర్‌ తన పర్యటనలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించి ఉంటే బాగుండేదని శరద్‌పవార్‌ పేర్కొన్నారు. పార్టీకి చెందిన భగీరథ్‌ బాల్కే బీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయన స్పందన కోరగా.. ఎవరో ఒక వ్యక్తి పార్టీని వీడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Updated Date - 2023-06-29T02:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising