BRS first list: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ఇంకెంతో టైమ్ లేదు.. ముహూర్తం ఎన్ని గంటలకంటే..
ABN, First Publish Date - 2023-08-21T13:17:17+05:30
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితా (BRS first list) ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాల ఉత్కంఠకు తెరపడింది. జాబితా ప్రకటన, సమయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారమే సోమవారమే (ఈ రోజు) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ అధికారికంగా నిర్ధారించింది.
హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే అభ్యర్థుల తొలి జాబితా (BRS first list) ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాల ఉత్కంఠకు తెరపడింది. జాబితా ప్రకటన, సమయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారమే సోమవారమే (ఈ రోజు) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ అధికారికంగా నిర్ధారించింది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ప్రారంభమవుతుందని, 3 గంటలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
116 మంది అభ్యర్థుల ప్రకటన..
మొదటి జాబితాలో 80-90 మంది పేర్లు ఉంటాయని తొలి నుంచి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఏకంగా 116 మంది పేర్లను ఒకేసారి ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. కేవలం 3 నియోజకవర్గాల్లో పేర్లను పెండింగ్‌లో పెట్టబోతున్నారని తెలుస్తోంది. మరి కేసీఆర్ ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారనేది మరికొద్ది సేపట్లోనే తేలిపోనుంది.
Updated Date - 2023-08-21T15:08:59+05:30 IST