ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nampally Fire Accident : బతుకులు బుగ్గి!

ABN, First Publish Date - 2023-11-14T03:15:28+05:30

ఆ అపార్ట్‌మెంట్‌లోని ఇళ్లలోకి అగ్నికీలల రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. దట్టమైన మంటలు.. విషపూరితమైన పొగతో ఉక్కిరిబిక్కిరి చేసి 9 మంది ప్రాణా లు

నాంపల్లిలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు.. 9 మంది దుర్మరణంఒకరు విషమం.. మృతుల్లో ఏడుగురిది ఒకే కుటుంబం.. వీరిలో రాత్రే తల్లి ఇంటికొచ్చిన కూతురు, ఆమె ఇద్దరు పిల్లలు

గ్రౌండ్‌ ఫ్లోర్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు, సినిమాల్లో పేలుళ్ల దృశ్యాల చిత్రీకరణకు ఉపయోగించే కెమికల్స్‌ డ్రమ్ముల నిల్వ

షార్ట్‌సర్క్యూట్‌తో భారీ పేలుడు.. అపార్ట్‌మెంట్‌లోకి ఎగసిపడిన మంటలు.. విషపూరిత పొగకు మెట్లపై పడి మృతి

గవర్నర్‌ దిగ్ర్భాంతి.. రెండ్రోజుల్లో నివేదికకు ఆదేశం.. ఘటనాస్థలికి మంత్రి కేటీఆర్‌.. రూ.5లక్షల చొప్పున పరిహారం

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఘోర ప్రమాదం: కిషన్‌రెడ్డి.. అగ్ని ప్రమాదాలకు నిలయంగా హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/మంగళ్‌హాట్‌/అఫ్జల్‌గంజ్‌/ నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆ అపార్ట్‌మెంట్‌లోని ఇళ్లలోకి అగ్నికీలల రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. దట్టమైన మంటలు.. విషపూరితమైన పొగతో ఉక్కిరిబిక్కిరి చేసి 9 మంది ప్రాణా లు తీసింది. ఒకరు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మాటలకందని ఈ విషాదం దీపావళి పండుగ మర్నాడు సోమవారం ఉదయం హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉండటం మరీ విషాదం. మృతుల్లో మరో ఇద్దరు భార్యాభర్తలున్నారు. వీరి కుమారుడు 75శాతం గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ప్రమాదంలో అపార్టుమెంట్‌ ముందు పార్కు చేసి ఉన్న ఓ కారు, ఏడు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫోర్లో రసాయన ద్రావణాలతో నింపిన డ్రమ్ములను నిల్వ చేయడం, వాటికి మంటలు అంటుకోవడంతో అవి పేలిపోయి అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నాంపల్లి బజార్‌ఘాట్‌ రెడ్‌హిల్స్‌ హిమాలయ హోటల్‌ లైన్లో రమేశ్‌ జైస్వాల్‌ అనే వ్యాపారికి నాలుగు ఫ్లోర్లతో కూడిన ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. జైస్వాల్‌కు ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఇందుకు ముడి సరుకుగా ఉపయోగపడే రసాయన ద్రావణాలను అతడు తన అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్లోనే నిల్వ చేస్తున్నాడు. సినిమా చిత్రీకరణల్లో పేలు డు దృశ్యాలు తీసేందుకు కూడా ఈ రసాయనాలను అతడు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రౌండ్‌ ఫ్లోర్లో పెద్ద ఎత్తున కెమికల్స్‌ లిక్విడ్‌తో కూడిన డ్రమ్ములను నిల్వ చేశాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ పోనూ పైన నాలుగు అంతస్తులనూ వివిధ కుటుంబాలకు అద్దెకిచ్చారు. ఈ నాలుగు అంతస్తుల్లో పది కుటుంబాల దాకా నివసిస్తున్నట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాకా అపార్టుమెంట్‌ వాసులంతా పటాకులు పేల్చి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకొన్నారు. సోమవారం పండుగ సెలవు కావడంతో అలసి సొలసి నిద్రపోయిన వారిలో చాలామంది ఇంకా పూర్తిగా లేవనేలేదు. ఉదయం 9:30 గంటలకు డ్రమ్ములు పేలిపోవడంతో పెద్దఎత్తున మంటలు ఎగిశాయి. అపార్ట్‌మెంట్‌లోని ఇళ్లలోంచి బచావ్‌ బచావ్‌ అంటూ అరుపులు వినిపించడంతో స్థానికులు సహాయక చర్యలకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్‌ ఇంజన్లు, మల్టీపర్పస్‌ టెంటర్‌ (ఎంపీటీ)లు, సెక్రటేరియట్‌ నుంచి బ్రోనో స్కైలి్‌ఫ్టలు, సీమోన్‌ స్నోకెల్‌లు తెప్పించారు. 6 అంబులెన్స్‌లు, పోలీసులు, డీఆర్‌ఎ్‌ఫటీమ్స్‌ టీమ్స్‌ సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. 11:00 గంటలకు మంటలు అదుపులోకి తెచ్చాయి.

గదిలో, మెట్లపైనే ప్రాణాలు కోల్పోయి..

పెద్ద ఎత్తున ఎగిసిన పడిన మంటలు రెండు, మూడు అంతస్తుల్లోకి ప్రవేశించాయి. అపార్టుమెంట్‌కు మధ్యలోంచి మెట్లు ఉండటంతో మొదటి అంతస్తులోని వారంతా మంటలు స్వల్పంగా ఉన్నప్పుడే మెట్లు దిగొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడు, నాలుగో అంతస్తుల్లోని వారు పైకి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. వారిలో 21 మందిని అగ్నిమాపక శాఖ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిచ్చెన ద్వారా సురక్షితంగా కిందకు దించారు. అపార్టుమెంట్‌కు ఎడమవైపు ఉన్న రెండో అంతస్తులోని రెండు కుటుంబాలకు చెందిన వారంతా మెట్లమార్గం గుండా కిందకు రావడానికి ప్రయత్నించారు. అప్పటికే పేలిపోయిన కెమికల్స్‌ డ్రమ్ముల్లోంచి విషపూరితమై పొగ దట్టంగా వ్యాపించడంతో గదుల్లోనే కొందరు..

మెట్లపైన కొందరు పడిపోయారు. ఈ ఘటనలో రెండో అంతస్తు అద్దె ఇంట్లోని కుటుంబ పెద్ద మహ్మద్‌ ఆజమ్‌ (58), ఆయన భార్య రెహానా సుల్తానా (50), వీరి కుమారుడు, ఫార్మసీ చదువుతున్న హాసిబ్‌ అవుర్‌ రహమాన్‌ (32), కూతురు, న్యూట్రిషన్‌ కోర్సు చేస్తున్న ఫయాజా సమీరా (26), పెద్ద కుమార్తె ఫరీనా (35), ఫరీనా కూతుళ్లు తరూబా (13), తూబా (6) మృతిచెందారు. మూడో అంతస్తుల్లో రిటైర్డ్‌ డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ (66), ఆయన భార్య నిక్కత్‌ సుల్తానా (55) మృతిచెందారు. ఈ దంపతుల కుమారుడు మహ్మద్‌ దల్హా 75శాతం గాయాలయ్యాయి. ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. ఆజమ్‌ పెద్ద కుమార్తె అయిన ఫరీనా, తన పిల్లలతో ఆదివారం రాత్రే ఇంటికొచ్చింది. చిన్నారులతో మృత్యువాతపడింది. అయితే టపాసుల నిప్పురవ్వలు పడటంతోనే ప్రమాదం సంభవించినట్లు తొలుత భావించారు. అయితే షాట్‌ సర్క్యూట్‌ వల్లే పేలుడు జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పేలుడు అనంతరం డ్రమ్ములోని రసాయన ద్రావణం రోడ్డుమీద వరదలా పారింది. కాగా, మొత్తం 75 వరకు డ్రమ్ములను నిల్వచేసినట్లు, అందులో కొన్నే పేలినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడుకు కారణమైన కెమికల్‌ను ‘రెసిన్‌ ఇ పాక్రీ పెట్రో కెమికల్‌’గా నిపుణులు గుర్తించారు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు.

గవర్నర్‌ దిగ్ర్భాంతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రమాద ఘటనపై గవర్నర్‌ తమిళిసై దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. క్షత గాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎ్‌సను ఆదేశించారు. ఘటనపై రెండ్రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా,మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

అగ్ని ప్రమాదాల నివారణలో సర్కారు విఫలం: రేవంత్‌

హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని, నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రెసిడెన్షియల్‌ ఎరియాలో కెమికల్‌ డ్రమ్ములను ఎలా నిల్వచేశారని ప్రశ్నిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరగాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

గుండెనొప్పంటూ ఆస్పత్రికి యజమాని

గ్రౌండ్‌ఫ్లోర్‌లో రసాయన కెమికల్స్‌ను అక్రమంగా నిల్వచేసి తొమ్మిది మంది సజీవ దహనానికి కారణమైన అపార్ట్‌మెంట్‌ యజమాని రమేశ్‌ జైస్వాల్‌.. ప్రమాద స్థలికి రాలేదు. పోలీసులు ఆరా తీయగా గుండెనొప్పితో గ్లోబల్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫైర్‌ సేఫ్టీ ఎక్కడ?

నాలుగంతస్తుల భారీ ఆపార్ట్‌మెంట్‌లో కనీసం ఫైర్‌ సెఫ్టీ ఎక్యూ్‌పమెంట్లు లేవు. అయినా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఎలా మంజూరు చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. అపార్టుమెంట్‌లో పేలుడు పదార్థాల నిల్వ ఉంచడంపై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-11-14T03:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising