క్రిస్మ్‌సకు ముస్తాబవుతున్న చర్చీలు
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:22 AM
దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయ మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి.
క్రిస్మ్‌సకు ముస్తాబవుతున్న చర్చీలు
సిద్ధమైన మఠంపల్లి శుభవార్త దేవాలయం
రెండు రోజులు పాటు ఘనంగా జరగనున్న వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేస్తున్న చర్చి కమిటీ పెద్దలు
మఠంపల్లిలో ముస్తాబైన చర్చి
మఠంపల్లి, నల్లగొండ కల్చరల్, డిసెంబరు 22: దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయ మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలకు దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పరవళ్లు తొక్కే కృష్ణానది తీరాన వెలిసిన శుభవార్త దేవాలయం, మరియమాత దీవెనలతో విరాజిల్లుతుంది. మరియమాత తల్లి తన సన్నిధికి వచ్చిన భక్తులందరినీ చల్లగా దీవిస్తూ వారి కోర్కెలు తీరుస్తూ అలరారుచున్నది. మరియమాత సన్నిధిలో కులాలు, మతాలకతీతంగా సేద తీరుతూ ప్రార్థిస్తూ ఆ తల్లి దీవెనలు పొందుతున్నారు. ఈ లోకానికి ర క్షుకుని అందించిన తల్లి మన బాధలను, వ్యాధులను, ఇతర సమస్యల ను తన కుమారుని ప్రార్ధించి మన అవసరాలు తీర్చే తల్లి మరియత ల్లి. ఆ తల్లి దీవెనలు పొందుటకు మిమ్ములను హృదయ పూర్వకముగా ఆహ్వానిస్తున్నామని సందేశం. ఈ శుభవార్త దేవాలయం (మంగళవార్త చర్చి) 1968వ సంవత్సరంలో నిర్మించుకున్నారు. ఈ చర్చి పురాతనం కావటంతో 1980 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1993వ సంవత్సరం లో పూర్తి చేశారు. అప్పటి వరుకు మంగళవార్త చర్చిగా పిలవబడుతు న్న దేవాలయాన్ని శుభవార్త దేవాలయంగా నామకరణం చేశారు. గ్రామంలోని క్రైస్తవ కుటుంబాలకు చెందిన ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల్లో ఉన్న బంధు మిత్రులందరూ ఈ పండుగకు విచ్చేయటం విశే షం. రెండు రోజుల పాటు జరిగే వేడుకల వివరాలను విచారణ గురువు మార్టిన్ పసల శుక్రవారం తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు నవదిన జపంములు, దివ్యబలిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దివ్యబలిపూజతో పాటు క్రైస్తవ భక్తులను ఉద్దేశించి ప్రసంగం, పండగ సందర్భంగా పలుసంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినట్లు విచారణ గురువు పసల మార్టిన్ తెలిపారు. 25న జరిగే శుభవార్త చర్చి జాతర కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు, తమ గురువులు, బిష్‌పలతో పాటు దేశ విదేశాల్లో ని క్రైస్తవులు కూడా హాజరై ప్రార్ధనలు నిర్వహిస్తారు.
క్రిస్మస్ గీతాలతో సందడి
క్రిస్మస్ గీతాలు.. ప్రత్యేక ప్రార్ధనలు.. బైబిల్ పఠనా లు.. ప్రముఖుల సందేశాల తో చర్చిలన్నీ మార్మోగాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.. మెర్రీ మెర్రీ క్రిస్మస్.. క్రిస్మస్ తాత ముచ్చట్లు.. జీసస్ జయంతి నాటికలతో అలరారాయి. చ ర్చీలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా ము స్తా బై దేదీప్యమానంగా వెలిగాయి. పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో గ ల తెలుగు బాప్టిస్టు చర్చి, దే వరకొండ రోడ్డులోని మరియరాణి కెథెడ్రల్ చర్చి, మిర్యాలగూడ రోడ్ లోని హౌజ్ ప్రేయర్స్ చర్చి, గెరిజీము కొండ చర్చి, ఆర్టీసీ కాలనీలోని సీఎ్‌సఐ చర్చి, హైదరాబా ద్‌రోడ్డు లోని కల్వరి కరుణ చర్చి తదితర ప్రాంతాల్లోని చర్చిలన్నీ క్రిస్మస్ జయంతి వేడుకలతో మార్మోగాయి. పలు చర్చీల్లో ఇప్పటికే సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, యూత్ క్రిస్మస్ వంటి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే పట్టణంలో చర్చీలు, క్రైస్తవుల గృహాలు, స్టార్, ట్రీ, ఇతర వస్తువులతో అలంకరించారు.
Updated Date - Dec 23 , 2023 | 12:22 AM