వేలం పాటలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పథకాలు
ABN, First Publish Date - 2023-11-06T04:21:05+05:30
వేలంపాట మాదిరిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు.
జనసేనతో కలిసే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తాం: లక్ష్మణ్
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): వేలంపాట మాదిరిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉచితాల పేరిట బీఆర్‌ఎస్ ప్రభు త్వం తెలంగాణ ఆర్థిక వనరులను ఖర్చుపెడుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలవి దగాకోరు ప్రభుత్వాలని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. దళితబంధు, గిరిజన బంధు అని చెప్పి ఉచిత ఎరువుల పథకాన్ని బీఆర్‌ఎస్ అటకెక్కించిందని.. కొత్త హామీలతో వస్తున్న ఆ పార్టీని నమ్మవద్దన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల డీఎన్‌ఏ ఒక్కటేనని.. ఈ రెండింటివి కూడా కుంభకోణాలు.. కుటుంబపార్టీలేనని విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఒక్కసారి అధికారమిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్, యూపీ తరహాలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తారని చెప్పారు. జనసేన అధినేత పవన్ తమకు సహజ మిత్రుడని.. పార్లమెంటు ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసే వెళ్తామని వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అందుకు పునాది కాబోతున్నాయని చెప్పారు.
Updated Date - 2023-11-06T04:21:06+05:30 IST