ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమబద్ధీకరణ కొందరికేనా..?

ABN, First Publish Date - 2023-05-05T01:26:40+05:30

వివిధ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన సర్కారు.. దశాబ్దాల నుండి సేవలందిస్తున్న తమను విస్మరించిందని పర్యాటక శాఖలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● టూరిజం కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదన

● సీఎం కేసీఆర్‌ ‘తొలి సంతకం’పై ఆశలు

● జీవోలో వారి ప్రస్తావనలేకపోవడంతో నిరాశ

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన సర్కారు.. దశాబ్దాల నుండి సేవలందిస్తున్న తమను విస్మరించిందని పర్యాటక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న తాము.. పదవీ విరమణకు దగ్గరలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచిన సర్కారు.. కార్పొరేషన్లలో 60ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని.. కానీ, పర్యాటక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులను 58 ఏళ్లకే ఇంటికి పంపుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తొలి సంతకం చేయడంతో.. పర్యాటక సంస్థలో పని చేస్తున్న 180 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. తీరా ఆ జీవోలో పర్యాటక సంస్థ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించగా.. రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమకూర్చిన ఫైల్‌ సీఎంవోకు పంపామని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను సర్కారు విస్మరిస్తోందని వాపోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఆతిథ్య రంగంలో కీలక పాత్ర పోసిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారు. కరోనా కల్లోలంలో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వేలాది మందిని సంస్థ హోటల్‌ గదుల్లో క్వారంటైన్‌లో ఉంచి రోజుల తరబడి సేవలందించిన తమను సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పర్యాటక సంస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచి, అర్హులైన 180 మంది సర్వీస్‌ను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-05-05T01:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising