ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DGP Anjani Kumar : డ్రగ్స్‌ రవాణాపై ఉక్కుపాదం మోపండి

ABN, First Publish Date - 2023-01-28T03:00:32+05:30

డ్రగ్స్‌ సమస్యపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్‌ తాజాగా పిలుపునిచ్చారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ (ఎన్‌డీపీఎ్‌స) చట్టం, దర్యాప్తు ప్రక్రియ అవగాహన కోసం సీఐడీ చీఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాదకద్రవ్యాల రవాణా గొలుసును అరికట్టండి

అధికారులకు డీజీపీ అంజనీ కుమార్‌ సూచన

మూడేళ్లలో 418 మందిపై పీడీ చట్టం అమలుచేసిట్లు వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ సమస్యపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్‌ తాజాగా పిలుపునిచ్చారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ (ఎన్‌డీపీఎ్‌స) చట్టం, దర్యాప్తు ప్రక్రియ అవగాహన కోసం సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులకు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరంగా మారిందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, గొలుసుకట్టు విధానంలో జరిగే మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని ఆయన సూచించారు. ‘‘నార్కోటిక్స్‌ డ్రగ్స్‌, సైకోట్రోఫిక్స్‌ చట్టాన్ని అమలు చేయడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. గత ఏడాది రాష్ట్రంలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న 1278 మందిపై కేసులు నమోదు చేశాం. 218 మందిపై పీడీ చట్టం అమలు చేశాం. 2021లో 152 మందిపై, 2020లో 46 మందిపైన కలిపి గడచిన మూడేళ్లలో మొత్తం 416 మందిపై పీడీ చట్టం ప్రయోగించాం. ఇదే కాలంలో డ్రగ్స్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 7498 మందిని అరెస్ట్‌ చేసి, 89,718 కిలోల గంజాయి, 711 కిలోల ఇతర డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నాం. డ్రగ్స్‌ కేసుల్లో ప్రాథమిక మూలాల నుంచి గమ్యస్థానాల వరకూ ఉండే గొలుసును అధికారులు పక్కాగా తెలుసుకోవాలి’’ అని డీజీపీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్‌ మూలాలు లేవని సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణాపై రాష్ట్ర పోలీసు విభాగం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్‌డీపీఎ్‌స కేసుల్లో సరైన దర్యాప్తు ప్రాముఖ్యతను అధికారులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఏజెన్సీలకు చెందిన 220 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. గత ఏడాది డ్రగ్స్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1278 కేసులు నమోదు అయ్యాయి. అందులో అత్యధికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 307 కేసులు నమోదవ్వగా.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 229 మంది, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 197 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-01-28T03:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising