ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somesh Kumar: తెలంగాణ నుంచి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రిలీవ్‌..!

ABN, First Publish Date - 2023-01-10T18:58:14+05:30

తెలంగాణ (Telangana) నుంచి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రిలీవ్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ (Telangana) నుంచి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రిలీవ్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఎల్లుండిలోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. సోమేష్‌కుమార్‌ (CS Somesh Kumar)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సీఎస్‌గా కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు (High Court) తీర్పు వెలువరించింది. సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోమేష్ కుమార్‌ను ఏపీకి కేంద్రం కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు (CAT Orders) ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు మూడు వారాలపాటు నిలిపివేశారు.

Updated Date - 2023-01-10T19:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising