ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'Dharani': ‘ధరణి’ లోపాలతో బ్రోకర్లకు మేలు

ABN, First Publish Date - 2023-04-26T02:42:18+05:30

రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూరిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ధరణి పోర్టల్‌ వల్ల బ్రోకర్లు బాగుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులు కావట్లేదని రోజూ 40 పిటిషన్లు

సీసీల కోసం ప్రజలు ఎక్కడికెళ్లాళి?

రెవెన్యూ శాఖ తీరుపై హైకోర్టు ఫైర్‌

పోర్టల్‌లో సమస్యలపై తీవ్ర ఆక్షేపణ

8 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తాం

హైకోర్టుకు సీసీఎల్‌ఏ మిత్తల్‌ హామీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూరిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ధరణి పోర్టల్‌ వల్ల బ్రోకర్లు బాగుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ధరణిలో పనులు కావడం లేదని, ఆయా పనులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిరోజూ 30 నుంచి 40 రిట్‌ పిటిషన్‌లు దాఖలవుతున్నాయని ఆక్షేపించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరణి ద్వారా సర్టిఫైడ్‌ కాపీలు జారీచేయడం లేదని, కారణం వివరించకుండా ‘రిజెక్ట్‌’ అనే పదంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణలో భాగంగా.. ధరణిలో సమస్యలపై వివరణ ఇచ్చేందుకు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ (సీసీఎల్‌ఏ) తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.

ధరణిలో లోపాల వల్ల మళ్లీ బ్రోకర్లు బాగుపడే పరిస్థితులు వస్తున్నాయని.. సర్టిఫైడ్‌ కాపీలు జారీ చేయకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ధర్మాసనం ప్రశ్నించింది. ధరణిలో సాంకేతిక సమస్యల వల్ల చదువురాని పేద ప్రజలు మళ్లీ బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, హైకోర్టుపై కేసుల భారం పెరుగుతోందని వ్యాఖ్యానించింది. అయితే, సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ వివరణ ఇస్తూ.. నాలుగు వారాల్లో అన్ని మాడ్యూల్స్‌ ఓపెన్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ల జారీకి సంబంధించిన అన్ని సమస్యలను నాలుగు వారాల్లో, మిగిలిన సమస్యలను ఎనిమిది వారాల్లో పరిష్కరిస్తామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. సీసీఎల్‌ఏ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం.. రిట్‌ పిటిషన్లపై వాదనలు ముగించింది.

Updated Date - 2023-04-26T02:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising