ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డిండిని ఆదర్శంగా అభివృద్ధి చేస్తా : రవీంద్ర

ABN, First Publish Date - 2023-07-15T00:33:45+05:30

డిండి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు.

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండిని ఆదర్శంగా అభివృద్ధి చేస్తా : రవీంద్ర

డిండి, జూలై 14: డిండి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిండి సర్పంచ సాయ మ్మ తాగునీటి సమస్యను, డిండి ఎంపీటీసీ 2 వెంకటయ్య మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో తాత్కాలికంగా నియామకాలపై ప్రశ్నించారు. వావిల్‌కోల్‌ గ్రామానికి ఏఈవోను నియమించాలని సర్పంచ దామోదర్‌రావు కో రారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ మిషనభగీరథ ద్వారా గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలను పూ ర్తి చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. పనుల్లో అధికారులు అ లసత్వం వహించవద్దని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉ పేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట వారం రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఎర్రగుంటపల్లి గ్రామంలో రూ.20లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎ మ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎంపీపీ మాధవరం సునిత జనార్ధనరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో గిరిబాబు, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, పీఏసీఎస్‌ చైర్మన శ్రీనివాసరావు, పేర్వాల జంగారెడ్డి, మల్‌రెడ్డి విష్ణువర్ధనరెడ్డి, సర్పంచ పేట రాధిక వెంకటయ్య, వైస్‌ఎంపీపీ పుల్లమ్మ, శ్రీనివా్‌సరెడ్డి, రవీందర్‌రావు, శ్రీనివా్‌సగౌడ్‌, గిరమోని శ్రీను, ఎంఎ. కలీం, అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ భవనాలకు స్థలాలు గుర్తించాలి : ఎంపీపీ

పెద్దఅడి శర్లపల్లి: గ్రామ పంచాయతీ, ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలకు ఖాళీ స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయలంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగనవాడీ సెంటర్ల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగనవాడీ కేంద్రాలను సూపర్‌వైజర్లు కచ్చితంగా తనిఖీ చేస్తూ కేంద్రాల్లో పిల్లలను ఎక్కువ మొత్తంలో చేర్చే విధంగా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్‌ లాల్‌ బహదూర్‌శాస్ర్తి మాట్లాడుతూ మీ సేవ నిర్వాహకులు ధరణి దరఖాస్తులను రిజక్ట్‌ చేసినా సదరు రైతులకు అవగాహన కల్పించడం లేదని అన్నారు. అంతేకాక మళ్లీ దరఖాస్తులు చేయిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మీ సేవా నిర్వాహకులకు హెచ్చరించారు. పంచాయతీ డీఈ మాట్లాడుతూ 19 గ్రామ పంచాయతీ భవనాలకు స్థలం సేకరించడంలో సర్పంచులు నిర్లక్ష్యం చేస్తున్నారని, త్వరగా స్థలం సేకరణ జరగకపోతే నిధులు ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని హెచ్చరించారు. అంతే కాకుండా ఉప ఆరోగ్యకేంద్రాలు కూడా 6 మంజూరు అయ్యాయని వాటి స్థలసేకరణ త్వరగా చేయాలని సర్పంచులను కోరారు. సర్వసభ్య సమావేశానికి 31 మంది సర్పంచులకు గాను 11 మంది, 14 ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. మూడు నెలలకొకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులకు, ప్రజాప్రతినిధులు సమయం కేటాయించడం లేదు. సమావేశంలో ఎంపీడీవో మోహనరెడ్డి, తహసీల్దార్‌ లాల్‌బహుదూర్‌శాస్ర్తి, పీఏసీఎస్‌ చైర్మన వల్లపురెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆర్వపల్లి సరితానర్సింహ, ఎంఈవో తరి రాములు, ఏవో పాండు, అంగనవాడీ సూపర్‌వైజర్‌ రజిత, పశువైద్యాధికారి మహేందర్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T00:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising