ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీవీఎం విద్యాసంస్థల వ్యవస్థాపకులు దొడ్డ ఎలమంద కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-11T01:08:42+05:30

నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీవీఎం విద్యా సంస్థల వ్యవస్థాపకులు దొడ్డ ఎలమంద (90) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లో మృతి చెందాడు.

ఎలమంద (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీవీఎం విద్యాసంస్థల వ్యవస్థాపకులు దొడ్డ ఎలమంద కన్నుమూత

నల్లగొండ, ఫిబ్రవరి 10: నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీవీఎం విద్యా సంస్థల వ్యవస్థాపకులు దొడ్డ ఎలమంద (90) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని నల్లగొండలోని డీవీఎం ప్రాంగణానికి తీసుకువచ్చి కళాశాల ప్రముఖులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సందర్శనాంతరం కళాశాల పక్కనే ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. పేద విద్యార్థులకు పాఠశాల, ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో 1979లో డీవీఎం ఎడ్యుకేషన సొసైటీని ఏర్పాటు చేశారు. తొలుత రామగిరిలో డీవీఎం పాఠశాలను ప్రారంభించారు. 1980-81 విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా విద్యార్థులకు బీఈడీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశలో ఏర్పాటు చేసిన ప్రైవేటు బీఈడీ కళాశాల ఇదే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అంత్యక్రియలను దొడ్డ ఎలమంద కుమారులు దొడ్డ నాగరాజు, దొడ్డ శాంతికుమార్‌ నిర్వహించారు.

Updated Date - 2023-02-11T01:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising