ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: ఓటుకు రూ.10 వేలు పంచినా.. భోకర్‌లో బోల్తా

ABN, First Publish Date - 2023-05-03T03:10:19+05:30

మహారాష్ట్రలో ఖాతా తెరవాలనుకున్నారు! పక్క రాష్ట్రంలోనూ బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని భావించారు! భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికలో పాలుపంచుకున్నారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌ ఎన్నికలో ఫలించని బీఆర్‌ఎస్‌ మంత్రాంగం

పెద్దఎత్తున నోట్లు కుమ్మరించినా రాలని ఓట్లు

ఏమాత్రం పని చేయని ‘తెలంగాణ ఫార్ములా’

18 డైరెక్టర్‌ పోస్టుల్లో ఒక్కటి కూడా దక్కని వైనం

బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా ఓటమి

నాందేడ్‌ జిల్లాలోని మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో

గతానికి భిన్నంగా ప్రవహించిన నోట్ల వరద

ఆదిలోనే బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టిన అశోక్‌ చవాన్‌

నిర్మల్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో ఖాతా తెరవాలనుకున్నారు! పక్క రాష్ట్రంలోనూ బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని భావించారు! భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికలో పాలుపంచుకున్నారు! ఎన్నికకు ముందే ఆ కమిటీ ఉన్న నాందేడ్‌ జిల్లాలోనే కేసీఆర్‌ తొలి సభను కూడా ఏర్పాటు చేశారు! పెద్దఎత్తున నేతలు ఆకర్షితులయ్యారంటూ కండువాలూ కప్పారు! ఆనక, ఎన్నికల్లో మునుగోడు ఉప ఎన్నికలో పాటించిన ‘తెలంగాణ ఫార్ములా’ను అమలు చేశారు! ఓటుకు రూ.10 వేల చొప్పున పంచిపెట్టారు! పెద్దఎత్తున ఓటర్లను కొనుగోలు చేశారు! అయినా, బొక్క బోర్లా పడ్డారు! తెలంగాణ ధనాన్ని పెద్దఎత్తున ప్రవహింపజేసినా.. భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు ఫలితం దక్కలేదు. అక్కడి కమిటీలో ఓటర్లైన రైతులు, పంచాయతీ ప్రతినిధులు, వ్యాపారులు.. చివరకు లేబర్‌ యూనియన్‌ ప్రతినిధులు కూడా ఆదరించలేదు. దీంతో, గత కొంతకాలంగా మహారాష్ట్రలో బీఆర్‌ఎ్‌సను విస్తరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఈ ఓటమి నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. భోకర్‌ మార్కెట్‌ కమిటీలోని 18 డైరెక్టర్‌ పోస్టులకు ఇటీవల ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. ఆ పార్టీకి సమీప ప్రత్యర్థిగా బీజేపీ మద్దతుదారులు నిలిచారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ 13 డైరెక్టర్‌ పోస్టులను; ఆ పార్టీ మిత్రపక్షంగా బరిలోకి దిగిన ఎన్సీపీ 2; బీజేపీ మూడు డైరెక్టర్‌ పోస్టులను గెలుచుకున్నాయి. ఒక్క పోస్టును కూడా గెలవలేక బీఆర్‌ఎస్‌ చతికిలపడింది. విశేషం ఏమిటంటే, ఇక్కడ బీఆర్‌ఎస్‌ కీలక నేత, ఎమ్మెల్యే అభ్యర్థి నాగనాథ్‌ కూడా స్వయంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 3,909 ఓట్లు పోల్‌ అవ్వగా.. బీజేపీకి 2,106 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎ్‌సకు 1,153 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన భోకర్‌లో ఈ ఎన్నిక.. మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో గెలుపు కోసం ఒక్కో పార్టీ పోటీ పోటీగా డబ్బులు పంచాయన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కో ఓటుకు గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఖర్చు చేయగా.. బీఆర్‌ఎస్‌ మాత్రం ఒక్కో ఓటుకు 10 వేల రూపాయల వరకు పంచిందని స్థానికులు చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పదవికి గతంలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన; రెండో స్థానంలో నిలిచిన బోసేవాడ్‌ నాగనాథ్‌ బీఆర్‌ఎ్‌సలో చేరి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. ఇక్కడ గెలుపు కోసం ఆయనకు సీఎం కేసీఆర్‌ స్వయంగా దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ కీలక నేత కూడా ఓటమి

మార్కెట్‌ కమిటీలో మొత్తం 18 డైరెక్టర్‌ పోస్టులకు గాను 11 డైరెక్టర్‌ పోస్టులకు రైతు సహకార సంఘాల ప్రతినిధులు ఓట్లు వేస్తారు. నాలుగు పోస్టులకు గ్రామ పంచాయతీ ప్రతినిధులు; రెండింటికి వ్యాపార సంఘాల ప్రతినిధులు; ఒక పోస్టుకు హమాలీ యూనియన్‌ ప్రతినిధులు ఓటు వేస్తారు. ఈ నాలుగు విభాగాల్లో వేటిలోనూ బీఆర్‌ఎ్‌సకు క నీస స్థాయిలో ఆదరణ లభించలేదు. అంతేనా, రైతు సహకార సంఘాల తరఫున జరిగిన ఒక డైరెక్టర్‌ పోస్టుకు అక్కడి బీఆర్‌ఎస్‌ కీలక నేత నాగనాథ్‌ కూడా పోటీ చేశారు. మొత్తం బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల్లో ఆయన ఒక్కరే ఎక్కువ ఓట్లు సాధించినా.. ఓటమి నుంచి తప్పించుకోలేదు. నాగనాథ్‌కు 197 ఓట్లు పోలవ్వగా.. గెలుపొందిన బీజేపీ అభ్యర్థి పాటిల్‌ సుభా్‌షకు 257 ఓట్లు పోలయ్యాయి. డైరెక్టర్‌ పోస్టుల్లో నాగనాథ్‌తోపాటు జాదవ్‌ ఉత్తంరావు మాత్రమే రెండంకెల ఓట్లను దాటగలిగారు. ఆయన 134 ఓట్లు సాధించారు. ఇక, గ్రామ పంచాయతీ, వ్యాపార సంఘాల, లేబర్‌ యూనియన్‌ డైరెక్టర్‌ పోస్టుల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఘోర పరాభవం చెందారు. లేబర్‌ యూనియన్‌ డైరెక్టర్‌ పదవిలో బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌ 6 ఓట్లు ఎక్కువ సాధించడం మాత్రమే విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 79 ఓట్లు రాగా బీజేపీకి రెండు, బీఆర్‌ఎ్‌సకు 8 ఓట్లు పోలయ్యాయి. కాగా.. రెండు వ్యాపార సంఘాల డైరెక్టర్‌ పోస్టులకు గాను బీఆర్‌ఎ్‌సకు ఒక పోస్టుకు సంబంధించి అభ్యర్థి కూడా దొరకలేదు.

చక్రం తిప్పిన మాజీ సీఎం అశోక్‌ చవాన్‌

బీఆర్‌ఎ్‌సను మహారాష్ట్రలో విస్తరించేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకొని చెక్‌ పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ సీఎం, ప్రస్తుత భోకర్‌ ఎమ్మెల్యే అశోక్‌ చవాన్‌ పకడ్బందీగా చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. వ్యూహాత్మకంగా బీఆర్‌ఎ్‌సను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో ఆయన అన్నిచోట్ల గట్టి అభ్యర్థులను రంగంలోకి దించారు. బీఆర్‌ఎస్‌ ‘నోట్ల ఫార్ములా’ను తిప్పికొట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయంటున్నారు. భోకర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ నాగనాథ్‌ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సీఎం కేసీఆర్‌ వద్ద మైలేజీని సంపాదించాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించిన అశోక్‌ చవాన్‌ బీఆర్‌ఎ్‌సతోపాటు నాగనాథ్‌ను మట్టి కరిపించారు.

తొలిసారి పెద్దఎత్తున డబ్బు పంపిణీ

ప్రతిసారీ సాదాసీదాగా జరిగే భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో ఈసారి బీఆర్‌ఎస్‌ బరిలోకి దిగి కొత్త ఫార్ములాను అంటగట్టిందని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడి ఓటర్లు గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో డబ్బు పంచారని చెబుతున్నారు. గతంలో డబ్బుల పంపిణీ నామమాత్రంగా ఉండేదని, ఈసారి మొదటి నుంచే బీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేయడంతో ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ సైతం నోట్ల పంపిణీకి దిగక తప్పలేదంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఒక్కో ఓటుకు 10 వేల రూపాయలకుపైగానే పంపిణీ చేయడమే కాకుండా మందు, విందు పార్టీలను పెద్ద ఎత్తున నిర్వహించిందన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా, కాంగ్రెస్‌, బీజేపీలు కూడా గరిష్ఠంగా రూ.5 వేల వరకూ పంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీనికితోడు, అక్కడి బహిరంగ సభలకూ విచ్చలవిడిగా ఖర్చు చేశారు. స్థానిక మీడియా సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు గుప్పించి కోట్లలో ఖర్చు చేశారు. ఏ స్థాయి నేత అన్న దానితో సంబంధం లేకుండా ప్రత్యేక విమానాలను పంపి తీసుకొచ్చి మరీ ప్రగతి భవన్‌, తెలంగాణ భవన్లలో కండువాలు కప్పారు. అయినా, తొలి ఎన్నికలోనే బోల్తా పడ్డారు.

కుట్టు మిషన్‌ గుర్తుతో బీఆర్‌ఎస్‌

ఈ ఎన్నిక పార్టీరహితంగా జరగడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కుట్టు మిషన్‌ గుర్తుపై పోటీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కప్పు సాసర్‌ గుర్తుపై, బీజేపీ గొడుగు గుర్తుపై బరిలోకి దిగాయి.

Updated Date - 2023-05-03T03:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising