ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గవర్నర్‌ ఉత్తర్వులు

ABN, First Publish Date - 2023-02-17T02:28:47+05:30

రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మే 1న, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానున్నాయని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే షెడ్యూలు జారీ చేసిన ఎన్నికల సంఘం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి తొలిరోజు 4 నామినేషన్లు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మే 1న, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానున్నాయని తెలిపారు. ఈ దృష్ట్యా రెండు స్థానాలకు కొత్త సభ్యులను ఎన్నుకోవాలని ఉత్తర్వుల్లో ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ రెండు స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. మొదటిరోజు గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాటేపల్లి జనార్దన్‌, అన్వర్‌ఖాన్‌ రెండు సెట్ల చొప్పున, బి.భుజంగరావు, గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాగా, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరు తేదీ. 24న నామినేషన్ల పరిశీలన, 27 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 13న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Updated Date - 2023-02-17T02:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising