ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి చంద్రశేఖర్‌?

ABN, First Publish Date - 2023-07-07T01:58:50+05:30

బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రె్‌సలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ నాయకత్వ వ్యవహార శైలిపై అసంతృప్తితో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రె్‌సలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ నాయకత్వ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న ఆయన .. పార్టీ మారడం ఖాయమేనన్న సంకేతాలు ఇస్తున్నారు. 2021 జనవరి 18న వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో చంద్రశేఖర్‌ బీజేపీలో చేరారు. అయుతే, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్య నేతల హామీ కార్యరూపం దాల్చకపోవడం, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో చంద్రశేఖర్‌ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యం ఉండేలా బాధ్యతలు అప్పగిస్తామని గతంలో బండి సంజయ్‌ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఆయన్నే పదవి నుంచి తప్పించడంతో చంద్రశేఖర్‌ ఆశలు నీరుగారిపోయాయి. పనిచేసే వారికి పార్టీలో విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో తన దారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు, వికారాబాద్‌ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవుల్లో కొనసాగిన చంద్రశేఖర్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకునేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రె్‌సలో చేరితే వ్యక్తిగత గౌరవంతో పాటు సరైన ప్రాధాన్యం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, తనను నమ్ముకున్న నాయకులకు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వాలని చంద్రశేఖర్‌ షరతు విధించినట్లు తెలిసింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి హామీ లభిస్తే కాంగ్రె్‌సలో చేరాలని చంద్రశేఖర్‌ భావిస్తున్నారు.

Updated Date - 2023-07-07T01:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising