ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ గృహనిర్భంధం

ABN, First Publish Date - 2023-07-09T23:32:29+05:30

కొత్తపల్లి మండలం చింతకుంటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పేదలకు ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ, ఏఐసీసీ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 9: కొత్తపల్లి మండలం చింతకుంటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పేదలకు ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ, ఏఐసీసీ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమాచారం అందుకున్న నగర పోలీసులు ఉదయం మంకమ్మతోటలోని పొన్నం ప్రభాకర్‌ ఇంటికకి చేరుకుని ఆయనను గృహనిర్భంధం చేశారు. మరో వైపున నగరంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చింతకుంటకు వెళ్ళకుండా ఎక్కడికక్కడ ఇళ్ల వద్దనే అరెస్టు చేశారు. దీంతో కరీంనగర్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింతకుంటలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. పొన్నం ప్రభాకర్‌ను గృహనిర్భంధం చేయడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ప్రజాస్వామ్యాయుతంగా చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ నియోజకవర్గంలో 15 వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే తొమ్మిదేళ్లుగా 660 ఇళ్లు మాత్రమే నిర్మించారని, వాటిని కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ హామీని అమలుచేయలేని గంగుల కమలాకర్‌ ఎలా సక్సెస్‌ఫుల్‌ మంత్రి అవుతాడో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల అరెస్టులతో కార్యక్రమాన్ని ఆపలేరని, పేదలకు డబుల్‌ బెడ్రూంలు ఇచ్చేవరకు పేదల పక్షాన పోరాడుతూనే ఉంటామని ప్రభాకర్‌ హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు మేనేని రోహిత్‌రావును అరెస్టు చేసి సీటీసీకి తరలించారు.

ఫ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద కాంగ్రెస్‌ నిరసన

కరీంనగర్‌ రూరల్‌: కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు పిలుపునివ్వగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పోలీసుల కళ్లు కప్పి చింతకుంటలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్దకు చేరుకున్నాడు. ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి సీటీసీకి తరలించారు.

Updated Date - 2023-07-09T23:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising