ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గజ్వేల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ గండిపేటకు బదిలీ!

ABN, First Publish Date - 2023-07-26T02:57:36+05:30

రిజిస్ట్రేషన్ల శాఖలో అసాధారణమైన పరిణామం చోటుచేసుకుంది. సుమారు 13 ఏళ్లుగా బదిలీ అన్నమాటే లేని ఈ శాఖలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఏడాదిన్నరకే బదిలీ అయ్యే అవకాశం లభించింది.

ట్రాన్స్‌ఫర్లపై నిషేధం ఉన్నా నచ్చిన చోటుకి..

జోనల్‌ నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌

సీనియర్లు 13 ఏళ్లుగా నిరీక్షిస్తున్నా లేని బదిలీ

ఏడాదిన్నర తిరక్కుండానే జూనియర్‌కు చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి నిఘా విభాగం): రిజిస్ట్రేషన్ల శాఖలో అసాధారణమైన పరిణామం చోటుచేసుకుంది. సుమారు 13 ఏళ్లుగా బదిలీ అన్నమాటే లేని ఈ శాఖలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఏడాదిన్నరకే బదిలీ అయ్యే అవకాశం లభించింది. అది కూడా జోనల్‌ నిబంధనలకు విరుద్ధంగా, తనదికాని జోన్‌కు వెళ్లే చాన్స్‌ దక్కింది. రాజన్న సిరిసిల్ల జోన్‌ పరిధిలోని గజ్వేల్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న హఫీజ్‌ను ప్రభుత్వం హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని గండిపేట సబ్‌ రిజిస్ట్రార్‌గా బదిలీ చేసింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో 75 మంది సబ్‌ రిజిస్ట్రార్లు, 22 మంది జిల్లా రిజిస్ట్రార్లు, ముగ్గురు డీఐజీలు, వందల సంఖ్యలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఎంతో కాలంగా బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆర్నెల్లుగా బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇదిగో, అదిగో అంటున్నారేగానీ, ప్రభుత్వం వారి మొరను ఆలకించినట్లు కనబడడం లేదు. మూడేళ్లకు పైబడి ఒకచోట పనిచేసిన వారు మాత్రమే వేరొకచోటకు బదిలీ రిక్వెస్టులు పెట్టుకోవాలనే నిబంధనలున్నాయి. ఈ రకమైన బదిలీ రిక్వెస్టులు పెట్టుకునేందుకే అర్హతలేక ఏడాదిన్నర క్రితం వేరేజోన్లకు బదిలీపై వెళ్లిన(317 జీవో బాధిత) సబ్‌ రిజిస్ట్రార్లు చాలామంది మూడేళ్లు ఎపుడు పూర్తవుతుందోనని ఎదురుచూస్తున్నారు. కానీ, గజ్వేల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హఫీజ్‌కు మాత్రం ఈ నిబంధనలేవీ అడ్డురాలేదు.

రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే హఫీజ్‌కు రెండేళ్ల క్రితమే సబ్‌ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. 317 జీవో మేరకు ఏడాదిన్నర క్రితం గజ్వేల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లారు. ఇంతలోనే ఆయనకు కోరుకున్న విధంగా హైదరాబాద్‌కు బదిలీ, ఆపై రిజిస్ట్రేషన్‌ శాఖలోనే అత్యంత కీలకమైన గండిపేట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌ లభించడం ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గండిపేటలో క్లియర్‌ వెకెన్సీ లేకున్నా, ఏడాదికి రూ.300 కోట్లకు పైగా ఆదాయం వ చ్చే రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో అత్యంత జూనియర్‌కు పోస్టింగ్‌ లభించడం పట్ల వారు ఆశ్చర్యపోతున్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగుల, అధికారుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలంటే అప్పటివరకు ఉన్న బ్యాన్‌ ఎత్తేయాలి. పైగా బదిలీల్లో జోన్లు, మల్టీజోన్లు ప్రాతిపదిక తప్పనిసరి. అయితే.. అటువంటి పద్ధతులకు భిన్నంగా, ప్రభుత్వ ఉత్తర్వుల రిఫరెన్స్‌ లేకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ నేరుగా ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం, డీఐజీ ఆదేశాలతో పనిలేకుండానే సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ సోమవారం (ఈ నెల 24న) విధుల్లో చేరడం ఆఘమేఘాల మీద జరిగినట్లు తెలిసింది.

నచ్చినట్లుగా పని చేసినందుకే.. !

గజ్వేల్‌లో పనిచేసినంత కాలం సబ్‌ రిజిస్ట్రార్‌ హఫీజ్‌.. కొందరు పెద్దలకు నచ్చినవిధంగా, వారు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసేవారని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం ఇటీవలే 111 జీవోను ఎత్తివేయడం, అక్కడి పలు ప్రాంతాలు గండిపేట పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో హఫీజ్‌ బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2023-07-26T02:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising