ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూదాన భూమిలో గుడిసెలు!

ABN, First Publish Date - 2023-01-23T04:28:21+05:30

నగరంలోని పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ పరిధిలో సీపీఐ పార్టీ ఆదివారం భూ పోరాటాన్ని ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద అంబర్‌పేట పరిధిలోని 100 ఎకరాల భూమిలో జెండాలు పాతిన సీపీఐ

వేలాదిగా చేరుకున్న ప్రజలు, గుడిసెల ఏర్పాటు

నచ్చజెప్పిన అధికారులు, ససేమిరా అన్న ప్రజలు

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ పరిధిలో సీపీఐ పార్టీ ఆదివారం భూ పోరాటాన్ని ప్రారంభించింది. కుంట్లూర్‌ రెవెన్యూ 216 నుంచి 224 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 100 ఎకరాల భూదాన భూమిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేదల గుడిసెల కోసం జెండా పాతి నాంది పలికారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, ఇక్కడ భారీగా గుడిసెలను వేయడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ సుమారు 200కోట్లు వరకూ ఉండొచ్చని అంచనా. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం సాంబశివరావుతో పాటు సీపీఐ నేతలు భూమిలో జెండా పాతి పోరాటాన్ని ప్రారంభించారు. స్థానిక కుంట్లూర్‌ పల్లవి ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి తట్టిఅన్నారం, కుంట్లూర్‌ రోడ్డు, ఆర్‌ఎన్‌ఆర్‌ కాలనీ రోడ్ల వరకూ ఇక్కడి పరిసరాలన్నీ వేలాది మంది ప్రజలతో నిండిపోయాయి. సొంతంగా ఇళ్లు లేని వారితో పాటు సీపీఐ కార్యకర్తలు సైతం భారీగా కార్యక్రమానికి తరలివచ్చారు. సుమారు 60 గజాల స్థలాల్లో కట్టెలతో గుడిసెలను వేశారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న హయత్‌నగర్‌ పోలీసులు, పరిస్థితుల్ని పరిశీలించారు.

గుడిసెలను పరిశీలించిన తహసీల్దారు

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ అనితారెడ్డి, ఆర్‌ఐ సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు భూదాన భూమి వద్దకు చేరుకుని గుడిసెలను పరిశీలించారు. సీపీఐ నేతలు, ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. గుడిసెలను వెంటనే తొలగించాలని, ఏదైనా ఉంటే దరఖాస్తు రూపంలో ఇవ్వాలని సూచించారు. అయితే.. గుడిసెలను తొలగించేది లేదని ప్రజలు తేల్చిచెప్పడం ఆసక్తికరం.

Updated Date - 2023-01-23T04:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising