ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Daggubati Suresh Babu, actor Rana: రూ.18 కోట్ల స్థలం వివాదం

ABN, First Publish Date - 2023-02-11T04:01:55+05:30

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని స్థలం వివాదంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు, ఆయన కుమారుడు నటుడు రానాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సురేష్‌బాబు, నటుడు రానాకు సమన్లు

ప్రైవేటు ఫిర్యాదుపై జారీ చేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని స్థలం వివాదంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు, ఆయన కుమారుడు నటుడు రానాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజా ల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయ డం లేదని.. తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌కుమార్‌ పచ్వా పోలీసులను ఆశ్రయించారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కాగ్నిజెన్స్‌గా తీసుకున్న కోర్టు.. సురేశ్‌బాబు, రానా వ్యక్తిగతంగా హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీచేసింది. విచారణను మే 1కి వాయిదా వేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు.. షేక్‌పేట మండలం సర్వే నం.403లోని ఫిలింనగర్‌ రోడ్‌ నం.1లో సినీ నటి మాధవికి చెందిన ప్లాట్‌ నం.2లో ఉన్న 1007 గజాలను సురే్‌షబాబు కొన్నారు. దానిపక్కనే హీరో వెంకటే్‌షకు చెందిన ప్లాట్‌ నం.3లో ఉన్న వెయ్యి గజాలనూ సురే్‌షబాబు కుటుంబం 2014లో హోటల్‌ ఏర్పాటు కోసం ప్రమోద్‌కు లీజుకిచ్చింది. 2018 ఫిబ్రవరిలో లీజు ముగుస్తుండగా ప్లాట్‌ నం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురే్‌షబాబు అంగీకరించడంతో రూ.5 కోట్లు చెల్లించి.. ప్రమోద్‌, ఇతరులు ేసల్‌ డీడ్‌ కుదుర్చుకున్నారు. కాగా, అంతకుముందే సురేష్‌ బాబు.. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్‌పై ఓ కేసు వేయడంతో పాటు ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. అయితే తన వద్ద రూ.5కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ప్రమోద్‌ కోర్టుకెక్కారు. ఈ వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఈ ఉదంతంపై 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. ఇవి కొలిక్కిరాకముందే ఏడాది క్రితం ఆ స్థలాన్ని సురే్‌షబాబు.. రానాకు విక్రయించారు. నవంబరు 1న ఆయనకు చెందిన ఆరుగురు వచ్చి స్థలంలోని సెక్యూరిటీ సిబ్బందిని తరిమివేశారు. ప్రమోద్‌ను బెదిరించారు. ప్రమోద్‌ అదే రోజు బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిరేస్టట్‌ను ఆశ్రయించారు.

Updated Date - 2023-02-11T08:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising