Balakrishna: బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని.. బాలయ్య భావోద్వేగం
ABN, First Publish Date - 2023-02-18T23:53:25+05:30
సినీ హీరో నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) మృతి పట్ల ఆయన బాబాయ్ బాలకృష్ణ(Balakrishna) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సినీ హీరో నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) మృతి పట్ల ఆయన బాబాయ్ బాలకృష్ణ(Balakrishna) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్నతో గడిపిన గుర్తులను గుర్తుతెచ్చుకున్నారు.తారకరత్న చివరి క్షణాల వరకు వెన్నంటి ఉండి చూసుకున్నారు. ఇక మీదట తన గొంతు వినపడదని తెలియడంతో కన్నీరు మున్నీరవుతూ బాలకృష్ణ ట్వీట్ చేశాడు.
‘‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్లాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
సినీ హీరో నందమూరి తారకరత్నకన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్ తీసుకువచ్చి మోకిలలోని తన ఇంటికి తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్‌కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
Updated Date - 2023-02-18T23:53:28+05:30 IST