ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని రాకకు నిరసనగా బొగ్గు గనుల్లో ఆందోళనలు

ABN, First Publish Date - 2023-04-07T02:58:24+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న హైదరాబాద్‌ వస్తున్నారు. అదే రోజు మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండంలో ధర్నాలు

పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

గనుల వేలం ప్రక్రియను వెనక్కి తీసుకోవాలి

కేంద్ర సర్కారుపై జంగ్‌ సైరన్‌ మోగిస్తాం: కేటీఆర్‌

చైనా చొచ్చుకొస్తుంటే.. ప్రచారంలో ప్రధాని

హైదరాబాద్‌, ఇల్లెందు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న హైదరాబాద్‌ వస్తున్నారు. అదే రోజు మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సింగరేణిని కూడా తెగనమ్మాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపును చూసి కేంద్రం ఓర్వలేకపోతోంది. సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కరెంట్‌ లేకుండా చేయాలని కుట్ర చేస్తోంది. తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడి. దీని ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తాం. మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సింగరేణి ద్వారా ఈసారి పురుడు పోసుకునే మహోద్యమంతో కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదు’’ అని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తాజాగా సింగరేణి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహి ంచాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చిందని విమర్శించారు. గనులను వేలం వేసేందుకు గతంలో ప్రయత్నించినా.. ప్రైవేటు కంపెనీల నుంచి ఎటువంటి స్పందన రాలేదని, ఇవే గనులను నేరుగా సింగరేణికి కేటాయించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చిందని, ఈ వేలం ప్రక్రియను మార్చి 29 నుంచి మే 30 వరకు నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ర్టానికి కొంగుబంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించి తెలంగాణను దెబ్బకొట్టాలన్న దురుద్దేశంతో కేంద్ర కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. సింగరేణి సంస్థ సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, మొత్తం తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టారని ఆరోపించారు. తెలంగాణ థర్మల్‌ విద్యుదుత్పత్తిలో సింగరేణి పాత్ర అత్యంత కీలకమని, అందుకే దానిపై కేంద్రం కక్ష కట్టిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు.

కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం.. అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తోందని, ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో కేంద్రం కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గుజరాత్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు నామినేషన్‌ పద్ధతిలో భారీగా లిగ్నైట్‌ గనులు కేటాయించిన కేంద్రం.. సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలన్న తమ ప్రభుత్వ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. గుజరాత్‌పై అపార ప్రేమను చూపిస్తున్న ప్రధాని మోదీ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. గత ఏడాది నవంబరు 12న రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని, ఇచ్చిన మాటను నిలుపుకోలేని ప్రధాని మరోసారి రాష్ర్టానికి వస్తున్న సందర్భంగా దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాగా, ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది.

Updated Date - 2023-04-07T02:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising