ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandan Rao: రాష్ట్రంలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి..

ABN, First Publish Date - 2023-01-20T15:13:14+05:30

హైదరాబాద్: తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తానేప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, సర్వే నంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఒకరికి ఒకలా, మరొకరికి ఇంకోలా పరిగణలోకి తీసుకుని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి కలెక్టర్‌కు అందరికీ ఒకే న్యాయం చేయరా? అని నిలదీశారు. చీఫ్ సెక్రటరీ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ అమోయ్ కుమార్ చేసింది తప్పా? అనుకోకుండా జరిగిందా? మీరే పరిశీలించి చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఎస్‌కు బహిరంగ లేఖ పంపిస్తున్నానన్నారు. ‘‘మాకు ప్రభుత్వం, ప్రగతి భవన్ గేట్లు ఎలాగూ తెరుచుకోవు.. మీరైనా మాకు అవకాశం ఇస్తారో లేదో అని లేఖ పంపిస్తున్నా.. మా లేఖను ఫిర్యాదుగా తీసుకోండి.. మాకు సమయం ఇస్తే మియపూర్ భూములు అన్యాక్రాంతం అయిన అంశంపై క్లారిటీ తీసుకుందాం’’ అని అన్నారు. బ్యూరోక్రాట్స్‌కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలని, ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కానీ 'క్యాట్' పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని, ఈ అంశంపై ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. ప్రధాని కార్యాలయానికి, డీఓపీటీకి కూడా రాతపూర్వకంగా లేఖ రాశానన్నారు. ఈ కేసుపై ఈనెల 27వ తేదీన వాదన జరగనుందని, 13 మంది సివిల్ సర్వెంట్స్‌పై భారత ప్రభుత్వం 2017లో పిటిషన్లు దాఖలు చేసిందని, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు ఇచినట్లే వారిపై కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.

Updated Date - 2023-01-20T15:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising