ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BV Raghavulu: అందుకే దక్షిణాదిన బలపడేందుకు బీజేపీ ప్రయత్నం...

ABN, First Publish Date - 2023-04-09T16:56:33+05:30

హైదరాబాద్: 2024 ఎన్నికల్లో బీజేపీ (BJP)ని ఓడించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు (BV Raghavulu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: 2024 ఎన్నికల్లో బీజేపీ (BJP)ని ఓడించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు (BV Raghavulu) అన్నారు. కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సభ ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ (Exhibition Grounds)లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉత్తరాదిలో బీజేపీ బలం కోల్పోతోందని.. అందుకే దక్షిణాదిన బలపడేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశంలో 40 రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్ది.. రానున్న రోజుల్లో అవన్నీ అమ్మడానికే ముస్తాబు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే ఎయిర్ పోర్టులన్నీ (Airports) ప్రధాని మోదీ (PM Modi) ప్రైవేట్ శక్తులకు అప్పజెప్పారని, దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనని రాఘవులు విమర్శించారు. భాగ్యలక్ష్మి దేవాలయనగరం నుంచి వెంకటేశ్వరని వరకు వందే భారత్ ట్రైన్ (Vande Bharat Train) వెళ్తుందని మోదీ చెబుతున్నారని, తాను నాస్తికుడినని.. వందే భారత్ రైల్ ఎక్కే అవకాశం లేదా‌?.. ముస్లీం, క్రైస్తవులు వందే భారత్ రైల్లో ప్రయాణం చేయకూడదా..? అని ప్రశ్నించారు. శాసన సభలో కమ్యూనిస్టులకు స్థానం ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్ట సభల్లో బలం పెంచుకోవాలన్నారు. తెలంగాణ పోరాటంలో వేల మంది కమ్యూనిస్టులు త్యాగం చేశారని, ఇవాళ తెలంగాణ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాఘవులు పిలుపిచ్చారు.

Updated Date - 2023-04-09T16:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising