ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Road Accidenet: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై పల్టీలు కొట్టిన కారు... అయినప్పటికీ...

ABN, First Publish Date - 2023-06-15T11:08:09+05:30

పెను ప్రమాదాలు జరిగిన చోట కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడగా.. మరికొన్ని సార్లు చిన్న ప్రమాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంతో బయటపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: పెను ప్రమాదాలు జరిగిన చోట కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా, ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడగా.. మరికొన్ని సార్లు చిన్న ప్రమాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంతో బయటపడ్డారు. కారు బోల్తా కొట్టిన విధానం.. కారు ధ్వంసమైన విధానం చూస్తే కచ్చితంగా ప్రాణాలతో ఉండరని అంతా అనుకుంటారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వస్తున్న కారు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణికుస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు హైవేపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. అయితే అతివేగం కారణంగానే కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-06-15T12:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising