బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
ABN, First Publish Date - 2023-01-31T00:25:26+05:30
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు.
మల్కాజిగిరి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు. ముందుగా మహారాష్ట్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఎమ్మెల్యే అనంతరం నాందేడ్‌లోని గురుగోబింద్‌సింగ్ జి గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు ప్రేంకుమార్, జితేంద్రనాధ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మల్కాజిగిరి నియోజకవర్గ అధికార పార్టీ ప్రతినిధి జీఎన్‌వీ సతీ్‌షకుమార్, మీడియా సెల్ కన్వినర్ గుండ నిరంజన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-31T00:25:30+05:30 IST