ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: నమ్మించి లక్షలను దండుకున్నాడు..

ABN, First Publish Date - 2023-01-06T11:27:16+05:30

మీరు కష్టపడి కొన్న భూములు తిరిగి మీకే దక్కేలా చేస్తాను.. నోటరీ ప్లాట్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జవహర్‌నగర్‌: ‘మీరు కష్టపడి కొన్న భూములు తిరిగి మీకే దక్కేలా చేస్తాను.. నోటరీ ప్లాట్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌ అక్కడి నుంచి తరలించేస్తాను’ అంటూ ఓ వ్యక్తి నమ్మించి రూ.13 లక్షలను దండుకున్నాడు. ఆ తర్వాత మార్కెట్‌ పనులు ఆగకపోవడంతో బాధితులు డబ్బుల కోసం నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో నివసిస్తున్న నర్సింహులు, మరికొందరు 2007లో బాలాజీనగర్‌కు చెందిన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్‌ 613, 614లో సుమారు 50ప్లాట్లు నోటరీ రూపంలో కొనుగోలు చేశారు. 2019లో అదేస్థలంలో మార్కెట్‌ అధికారులు కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌ కోసం షెడ్‌ నిర్మాణాలు చేపట్టారు.

దీంతో ప్లాట్ల యజమానులు సిర్నే రాజును ఆశ్రయించారు. మార్కెట్‌ యార్డు పనులు ఆపించడానికి రూ. 25 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో వారు రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.5లక్షల చెక్కు, 8లక్షల నగదు సిర్నేరాజుకు ఇచ్చారు. అయినా మార్కెట్‌ పనులు ఆగలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు అతడిని కోరగా పట్టించుకోకపోవడంతో పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో కొద్ది నెలల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు సిర్నే రాజుపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి మూడు నెలల సమయం కావాలని రాజు కోరడంతో.. ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని బాధితుడు నర్సింహులు వాపోయాడు. విచారణ చేసి న్యాయం చేయాలని అతడు కోరుతున్నాడు.

Updated Date - 2023-01-06T11:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising