ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Metro: ఇకపై ఈ రూట్లలో రైళ్లకోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

ABN, First Publish Date - 2023-04-25T11:23:12+05:30

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో అదనంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గత కొద్దిరోజులుగా మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో అదనంగా మెట్రోరైళ్లను నడిపించేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది. అమీర్‌పేట్‌(Ameerpet), సికింద్రాబాద్‌(Secunderabad), మెట్టుగూడ(Mettuguda) స్టేషన్ల నుంచి షార్ట్‌ లూప్‌ మెట్రోరైళ్లను నడిపిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో వర్గాలు వెల్లడించాయి.

మెట్రో షార్ట్ లూప్ ట్రిప్పుల ద్వారా రైళ్లు స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు దోహదపడతాయి. దేశ, విదేశాల్లో పీక్‌ అవర్స్‌లో ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. అమీర్‌పేట్‌ నుంచి రాయదుర్గం మార్గంలో ఐటీ కార్యాలయాలు అధికంగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకటి, రెండు గంటలు తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఈ మేరకు షార్ట్‌లూప్‌ మార్గం (రెండో ట్రాక్‌) ద్వారా ఖాళీ రైలును అమీర్‌పేటకు రప్పించి అక్కడి నుంచి రద్దీ ఉన్న మార్గాలకు నడిపించనున్నారు. వాటి కోసం 12 రైళ్లు సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు. రద్దీ నిర్వహణకు మహిళా గార్డులు, అదనపు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు.

Updated Date - 2023-04-25T13:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising