TS News: హయత్‌నగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య
ABN, First Publish Date - 2023-06-05T10:24:16+05:30
నగరంలోని హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండుగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండుగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యమ్మ అనే వృద్ధురాలు హయత్‌నగర్‌లో నివాసముంటోంది. సత్యమ్మ కుమారులు ఎల్బీనగర్‌లో నివాసం ఉండగా.. సత్యమ్మ ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఒంటిరిగా ఉన్న ఇంట్లో సత్యమ్మ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు... నిద్రిస్తున్న ఆమెపై దాడి చేశారు. వృద్ధురాలి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆపై బంగారు ఆభరణాలను దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2023-06-05T10:24:16+05:30 IST