TS High Court: టీఎస్పీఎస్సీ సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్‌పై హైకోర్టు విచారణ.. రేపటికి వాయిదా..
ABN, First Publish Date - 2023-04-10T12:18:06+05:30
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), ఈవో ఎగ్జామ్స్ (EO Exams)పై హైకోర్టు (High Court)లో సోమవారం విచారణ జరిగింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), ఈవో ఎగ్జామ్స్ (EO Exams)పై హైకోర్టు (High Court)లో సోమవారం విచారణ జరిగింది. రెండు ఎగ్జామ్స్‌ను కాన్సిల్ చేయాలని కోరుతూ 76 మంది అభ్యర్థులు పిటిషన్ (Petition) దాఖలు చేశారు. ఈరోజు విచారణ నేపథ్యంలో వాదనల కోసం పిటిషనర్లు సమయం కోరారు. సుప్రీం కోర్టు (Supreme Court) సీనియర్ కౌన్సిల్ రేపు (మంగళవారం) వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
టీఎస్పీఎస్సీ సీడీపీవో, గ్రేడ్ 1 (Grade 1) సూపర్‌వైజర్ (Supervisor) నియామక పరీక్షలపై హైకోర్టు (High Court)లో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
Updated Date - 2023-04-10T12:18:06+05:30 IST