Minister Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..
ABN, First Publish Date - 2023-08-01T12:39:55+05:30
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. తుది వాదనలు వినాల్సి ఉందని స్పష్టం చేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి లక్షణ కుమార్ 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈశ్వర్ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. ఈ క్రమంలోనే లక్షణ్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిని నేడు హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Updated Date - 2023-08-01T12:39:55+05:30 IST